EPAPER

Jr NTR vs Ram Charan : గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదే మరి… తారక్ పై ఈజీగా గెలిచాడు..

Jr NTR vs Ram Charan : గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే ఇదే మరి… తారక్ పై ఈజీగా గెలిచాడు..

Jr NTR vs Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఈగర్ గా సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘రా మచ్చా మచ్చా’ అనే సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ పై రామ్ చరణ్ గెలిచాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


ఎన్టీఆర్ పై రామ్ చరణ్ గెలిచాడు..

రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన పోస్టర్స్, మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాటగా ‘రా మచ్చా మచ్చా’ అంటూ హీరో పాత్రను పరిచయం చేస్తూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చగా, నకాష్‌ అజీజ్‌ ఆలపించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నారు.


ఈ పాట నిన్న సాయంత్రం రిలీజ్ అయ్యింది. కేవలం కొద్ది గంటలలో 10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సాంగ్ వచ్చిన 6 గంటలకే అన్ని వ్యూస్ ను అందుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. అయితే ఈ విషయం పై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ పై మరోసారి రామ్ చరణ్ పై చెయ్యి సాధించాడు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ 24 గంటల్లో సాధించలేనిది, రామ్ చరణ్ ఆరు గంటల్లో సాధించాడని సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఇక పోతే గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇకపోతే ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. ఇక చివరి షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ ఉంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా ఈ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.. ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×