OTT Movie : ఎంటర్టైన్మెంట్ అంటే మొదటగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు గుర్తుకొస్తాయి. ఎన్నో సినిమాలు ఈ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. మంచి స్టోరీ తో రొమాంటిక్ సినిమాలు తీస్తే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు “ది స్లీపింగ్ డిక్షనరీ” (The Sleeping Dictionary) ఒక మారుమూల ఊరిలో హీరోకి భాష నేర్పించడానికి, ఆ ఊరి పద్ధతులు పాటించడానికి, ఆ ఊరి ఆచారం ప్రకారం ఒక అమ్మాయి అతనితో ఏకాంతంగా గడుపుతుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మారుమూల ప్రాంతంలోని ఒక ఊరి అలవాట్లు, సాంప్రదాయాలు, భాషను తెలుసుకోవడానికి హీరో వస్తాడు. అక్కడ హెన్రీ అనే వ్యక్తి హీరోని రిసీవ్ చేసుకుంటాడు. ఆ ఊరి సంప్రదాయం ప్రకారం అతనికి ఒక డ్రింక్ ఇస్తారు. ఆ డ్రింక్ తాగకపోతే వాళ్లను అవమానించినట్లు ఫీల్ అవుతారు. హీరో ఆ డ్రింక్ తాగుతూ అక్కడున్న ఆడవాళ్ళతో డాన్స్ చేస్తాడు. అయితే ఆ ఊరి ఆచారం ప్రకారం వారి భాష సంప్రదాయాలను తెలుసుకోవాలనుకున్న వ్యక్తి, ఆ ఊరి అమ్మాయి తో ఏకాంతంగా గడపాల్సి ఉంటుంది. ఆ ఊరి పెద్దలు ఒక అందమైన అమ్మాయిని హీరో దగ్గరికి పంపుతారు. ఆమె చాలా అందంగా ఉంటుంది. మొదట హీరో ఆ అమ్మాయి పక్కన పడుకున్నా గాని ఏమీ చేయకపోవడంతో కొంతమంది అతనిని ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత ఆమె మాటలకు, అందానికి తపించి ఆమెతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. రోజురోజుకి ఆమె మీద ఇష్టం కూడా పెరుగుతుంది. అయితే అదే ఊరిలో అనుకోకుండా ఒక ఉపద్రవం ముంచుకొస్తుంది.
ఆ ఊరి జనం అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక హీరో బాధపడతాడు. విషయం ఏమిటో కనుక్కోవాలి అనుకుంటాడు. ఆ ఊరికి వచ్చిన యూరోపియన్లు వీళ్లకు ఇచ్చే బియ్యంలో విషం కలిపి ఉంటారు. ఈ విషయం హీరో గ్రహించి ఆ ఊరి పెద్దలకు చెప్తాడు. చివరికి యూరోపియన్లను ఆ ఊరి పెద్దలు తరిమికొడతారా? యూరోపియన్లు ఆ ఊరి వాళ్ళను బందీలుగా చేస్తారా? హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “ది స్లీపింగ్ డిక్షనరీ” (The Sleeping Dictionary) యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీని ఒంటరిగా చూడటమే మంచిది.