BigTV English

OTT Movie : ప్రేమించిన అమ్మాయికోసం ప్రాణం మీదకు తెచ్చుకునే ప్రేమికుడు… కిక్ ఎక్కించే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : ప్రేమించిన అమ్మాయికోసం ప్రాణం మీదకు తెచ్చుకునే ప్రేమికుడు… కిక్ ఎక్కించే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడటానికి చాలా క్రేజీగా ఉంటాయి. ఈ సినిమాలు మొదటినుంచి చివరి దాకా ప్రేక్షకులను కదలనియకుండా కట్టిపడేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ తో పాటు సస్పెన్స్ ఉండే ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


ఆపిల్ టీవీ

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు ‘గోస్టెడ్’ (Ghosted). హీరోయిన్ కోసం హీరో దేశాలు దాటి ప్రమాదంలో ఇరుక్కుపోతాడు. హీరో హీరోయిన్ ల చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆపిల్ టీవీ (Apple Tv) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ మొక్కలు కొనడానికి ఒక షాప్ కి వెళ్తుంది. అక్కడ హీరో మొక్కలను అమ్ముతూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి ఎక్కువ రోజులు నీళ్లు పోయకుండా ఉండే మొక్కలు కావాలని హీరోయిన్ అడుగుతుంది. దానికి హీరో ఒక మొక్క చూపించి, ఒక నెల రోజులు ఈ మొక్క కు నీళ్లు అవసరం లేదని చెప్తాడు. అందుకు ఆమె నేను మూడు నెలలు ఇంట్లో ఉండను, అంతవరకు నీళ్లు పోయనవసరంలేని మొక్క ఏదైనా ఉందా అని అడుగుతుంది. కోపం వచ్చిన హీరో ఆమెతో, నీళ్లు పోయకుండా అన్ని రోజులు ఏ చెట్టు ఉంటుంది అంటూ కోప్పడతాడు. ఆ తర్వాత ఆమెకు సారీ చెప్తాడు. ఎందుకంటే మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. సారీ చెప్పడంతో ఆమె కూడా అతనితో మాట్లాడుతూ కాఫీ షాప్ కు వెళ్తుంది. అలా వీళ్ళిద్దరూ అదే రోజు ఏకాంతంగా కూడా గడుపుతారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో హీరో ఒక సెల్ఫీ కూడా తీసుకుని ఉంటాడు. హీరో ఆమెను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ బ్యాగులో, తన తండ్రి వాడే ఇన్హేలర్ ను పెట్టి హీరో  మర్చిపోతాడు. మరుసటి రోజు హీరోయిన్, హీరో ఫోన్ కి రెస్పాన్స్ అవ్వదు. ఆమె పర్స్ లో ఉన్న ఇన్హేలర్ కి  ట్రాకింగ్ డివైస్ ఉండడంతో ఆమె ఎక్కడుందో హీరో కనుక్కుంటాడు. ఆ ఇన్హేలర్ లండన్ లో ఉన్నట్టు చూపిస్తుంది. హీరోయిన్ కూడా అక్కడే ఉంటుందనుకొని లండన్ కి బయలుదేరుతాడు హీరో.

లండన్ కి వెళ్లిన హీరోని విలన్ కిడ్నాప్ చేస్తాడు. అతన్ని గూడచారి అనుకొని పాస్వర్డ్ చెప్పమని అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి అందర్నీ కాల్చి అతన్ని తీసుకుపోతుంది.  ఆ తర్వాత విలన్ వెంబడిస్తూ ఉంటాడు. ఒకచోట వీళ్ళిద్దరిని మళ్లీ పట్టుకుని ఏరోప్లేన్ లో తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడినుంచి హీరో, హీరోయిన్ తో పారాషూట్ వేసుకొని దూకేస్తాడు. వీళ్ళిద్దరూ ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ల్యాండ్ అవుతారు. హీరోయిన్ ఒక F. B .I ఏజెంట్ అని తెలుసుకుంటాడు. వ్యవసాయం చేసుకునే హీరోకి ఇవంతా కొత్తగా అనిపిస్తాయి. ఆమెను ప్రేమిస్తుండటంతో వీటన్నిటికీ దూరంగా తనతో వచ్చేయమంటాడు. చివరికి విలన్ నుంచి వీళ్లిద్దరూ బయటపడతారా? హీరో, హీరోయిన్లు వీటన్నిటిని వదిలి కొత్త జీవితాన్ని మొదలు పెడతారా? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పని మనిషితో యజమాని యవ్వారం… ఇంటి పని కోసం పిలిచి ఇదేం పని సామీ… క్లైమాక్స్ ట్విస్ట్‌కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

Big Stories

×