Gundeninda GudiGantalu Today episode December 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. ముందురోజు బాలును బాలును ఇంట్లో అడ్డంగా ఇరికించాలని రోహిణి నిజం బయట పెడుతుంది. కానీ సత్యం బాలు చేస్తున్న పనికి షాక్ అవుతాడు. ఇక సత్యం తన కొడుకు కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకుంటాడు. తర్వాత రోజు ఇంట్లో బాలు టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. మీనా అతనికి టిఫిన్ వడ్డిస్తుంది. అక్కడికి ప్రభావతి వచ్చి.. మిగతా వాళ్ళకి ఉందో లేదో.. చూసుకుంటూ వడ్డించు.. మొత్తం వాడికే వడ్డించకంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. అందుకే తాను కార్లకున్న దుమ్ము కడగడానికి వెళ్తున్నానని, ఇలాంటి మాటలు తనకు పడడం ఇష్టం లేదని అంటాడు. ఈ సమయంలో ప్రభావతి.. ఏం చేస్తున్నావ్ అంటూ రోహిణి తో మాట్లాడుతుంది. తాను అకౌంట్స్ చూస్తున్నానని, రేపు మేడం వస్తుందంటూ రోహిణి నోరు జారుతుంది. నువ్వే కదా పార్లర్ కు మేడం.. మళ్లీ మేడం అంటున్నావు అని అడుగుతుంది ప్రభావతి. మేడం అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని, ఆమె వచ్చి ఆడిటింగ్ చేస్తుందంటూ కవర్ చేస్తుంది. ప్రభావతి.. నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారు అంటుంది. దీంతో రోహిణి కూడా షాక్ అవుతుంది. అలా అంటున్నారేంటీ.. మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా అని ప్రశ్నిస్తుంది. హ చేస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. కానీ బాలు వాళ్లకు రోహిణి మీద అనుమానం మొదలవుతుంది. రోహిణి ఏదో కవర్ చేసుకోవాలని ఏదో ఒకటి చెప్తుంది. అవును ఆంటీ ఇంతకీ మనోజ్ మీకు డబ్బులు ఎంత ఇస్తున్నాడు అనేసి అడగని మనోజ్ షాక్ అవుతాడు. అబద్ధాలు చెప్పడం కంటే జాబ్ చేయడమే ఈజీగా ఉందని మనసులో అనుకుంటాడు.
ఇక ప్రోమో విషయానికొస్తే.. ఇంట్లో అందరు ఉన్నా కూడా సత్యం కనిపించలేదు. బాలు మీనాను అడుగుతాడు. ఏమో అండి టిఫిన్ కూడా చేయలేదు బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదని మీనా అంటుంది. నాన్న బయటికి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావ్ టైం కి తినాలి టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాలని లేదా అనేసి మీనా పై బాలు అరుస్తాడు. అందరి మీద పడి అందరు ఏడుస్తుంటారు కానీ నాన్నను పట్టించుకునే వాళ్ళు ఒకరు లేరు అనేసి ప్రభావతిని చూసి అంటాడు. మనోజ్ ఇంట్లోనే గేమ్స్ ఆడుతూ కనిపించడంతో మనోజ్ జాబ్ మానేశాడని మౌనికకు డౌట్ వస్తుంది. ఆఫీస్‌కు ఎందుకు వెళ్లలేదని అడుగుతుంది. మనోజ్‌కు ఒంట్లో బాగాలేదని అతడి బదులు ప్రభావతి ఆన్సర్ ఇస్తుంది. ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడం ఒంట్లో బాగాలేకపోవడమా అని మౌనిక సెటైర్లు వేస్తుంది. ఇక అత్త భజన అనే కార్యక్రమం చేస్తుందని రోహిణిని బాలు దారుణంగా అంటాడు. ఇక ప్రభావతితో పాటుగా ఇంట్లో అందరికి అనుమానం మొదలవుతుంది.
ఇంట్లో నువ్వు, మనోజ్ కష్టపడి సంపాదిస్తుంటే తిని కూర్చునేవాళ్లు పెరిగిపోతున్నారని బాలు, మీనాలపై తన మనసులో ఉన్న కోపం బయటపెడుతుంది ప్రభావతి.. దానికి మౌనికతో పాటు అందరు కూడా ప్రభావతి పై సీరియస్ అవుతారు. ఇక గణపతికి డబ్బులు ఇచ్చేసి కారును ఇంటికి తీసుకొస్తాడు సత్యం. కారు కీస్‌ను మీనా చేతుల మీదుగా బాలుకు ఇప్పిస్తాడు. మీనా వల్లే కారు తిరిగి తన సొంతం కావడంతో బాలు ఆనంద పడతాడు. ఫైనాన్షియర్‌ను కలిసినందుకు మీనాను అనవసరంగా తిట్టానని బాధపడతాడు. ఆ విషయంలో మీనాకు సారీ చెప్పాలని అనుకుంటాడు. డైరెక్ట్‌గా ఈ మాట చెప్పలేకపోతాడు.. తన ఫ్రెండ్ ను తీసుకొని వస్తాడు. అతనికి ఒక విషయం చెప్పి పంపిస్తాడు. ఇక అతను మీనా నీకు బాలు ఏదో చెప్పాలంట అంటాడు. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకొండి మధ్యలో నన్ను ఇన్‌వాల్వ్ చేయద్దని బాలుతో ఫ్రెండ్ అంటాడు. నోరు మూసుకొని నేను నీకు చెప్పింది మీనాతోచెప్పమని స్నేహితుడికి బాలు వార్నింగ్ ఇస్తాడు. నీ వల్లే కారు దక్కిందట…తొందరపడి తిట్టడటా…నీకు సారీ చెప్పాలని బాలు అనుకుంటున్నాడని మీనాతో బాలు ఫ్రెండ్ చెబుతాడు. నన్ను ఊరికే తిట్టినప్పుడు కొట్టినప్పుడు లేని రోషం…పౌరుషం సారీ చెప్పడానికి వచ్చిందా అని మీనా అంటుంది. నా జీవితంలో నేను ఎవరికి సారీ చెప్పలేదని బాలు వాదిస్తాడు.. చివరికి తన భార్యకు సారీ చెప్పేస్తాడు బాలు.. మీనాను తీసుకెళ్లి కారు ముందు సీటులో కూర్చోబెడతాడు బాలు. కళ్లు మూసుకోమని చెబుతాడు. ఆమె చేతికి గాజులు తొడుగుతాడు. ఆ గాజులు చూసి మురిసిపోతుంది మీనా. నాపై కోపం పూర్తిగా పోయిందా అని బాలును అడుగుతుంది మీనా. ఆ కోపం అలాగే ఉందని బాలు అంటాడు. నీ వల్ల నాకు కారు దక్కింది. అందుకు గాజులు గిఫ్ట్‌గా ఇచ్చానని చెబుతాడు. ఇక మనోజ్ ఇంట్లో బాలుకు కారు ఇవ్వడానికి డబ్బులు ఇచ్చాడని సత్యంతో గొడవలు పడతాడు. ఇక అక్కడితో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో రవి ఇంటికి వస్తాడు. బాలు చూస్తాడా? చూస్తే ఏం జరుగుతుంది అనేది చూడాలి..