BigTV English

OTT Movie : భార్యకు దగ్గరుండి రెండో పెళ్లి చేసే భర్త… చివరకు ఊహించని ట్విస్ట్

OTT Movie : భార్యకు దగ్గరుండి రెండో పెళ్లి చేసే భర్త… చివరకు ఊహించని ట్విస్ట్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, మరికొన్ని సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మతాచారాలతో ఆడవాళ్లు పడుతున్న కష్టాలను ఈ మూవీలో చక్కగా తెరకెక్కించారు మేకర్స్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి


జి ఫైవ్ (Zee5)

ఇది ఒక మరాఠీ మూవీ. మతాచారాలతో విడాకులు తీసుకున్న మహిళను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి భర్త ప్రయత్నిస్తాడు. వాళ్ళ ఆచారం ప్రకారం ఆమె మరొకరిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. వీళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు “హలాల్” (Halal). ప్రస్తుతం ఈ మూవీ ‘జీ 5’ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కుడోస్, హలీమా ఇద్దరూ భార్య భర్తలు. కుడోస్ తల్లి హలీమాను  బాగా టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు కుడోస్ తల్లి హలీమాను గట్టిగా కొట్టడంతో ఆమె తలకు దెబ్బ తగులుతుంది. భార్యను బాగా ప్రేమించే కుడోస్ ఆ గాయాన్ని చూసి ఆమెకు అక్కడ తలాక్ చెప్తాడు. ఇంట్లో గొడవలు సర్దుకున్నాక నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంటికి తెస్తాను అని చెప్పి, ఆమెను కుడోస్ పుట్టింట్లో దింపుతాడు. ఆ తరువాత ఒకరోజు అనారోగ్యంతో కుడోస్ తల్లి చనిపోతుంది. ఈ క్రమంలో భార్యను మళ్లీ తెచ్చుకోవాలని ఆమె ఇంటికి వెళ్తాడు కుడోస్ . అయితే మత ఆచారాల ప్రకారం అలా కుదరదని ఆమె తండ్రి చెప్తాడు. నువ్వు మళ్ళీ ఆమెను తీసుకువెళ్లాలంటే, ఆమె వేరొకరిని పెళ్లి చేసుకొని, అతనితో విడాకులు తీసుకున్న తర్వాతనే నువ్వు తీసుకు వెళ్లాల్సి ఉంటుందని ఆమె తండ్రి చెబుతాడు. అయితే నమ్మకమైన వ్యక్తి  కోసం ఆ ఊరి పెద్దతోనే పెళ్లి జరిపిస్తారు.

మూడు నెలల్లో మూడుసార్లు తలాక్ చెప్పాలని మాట తీసుకుంటాడు కుడోస్. ఈ క్రమంలో హలీమా ఆ ఊరి పెద్దతో మూడు నెలలు సంసారం చేయడంతో అతని మీద ప్రేమ పుడుతుంది. అతని మంచితనం చూసి విడాకులు ఇవ్వద్దని కోరుతుంది. ‘నేను మాట ఇచ్చాను, నువ్వంటే కూడా నాకు ఇష్టం. అయితే ఇప్పుడు మాట తప్పలేను’ అని ఆ ఊరి పెద్ద ఆమెతో చెప్తాడు. చివరగా తలాక్ చెబుతుండగా మధ్యలో హలీమా అతనిని  అడ్డుకుంటుంది. నా ప్రమేయం లేకుండా నా మొదటి భర్త తలాక్ చెప్పాడు, నా ప్రమేయం లేకుండా రెండో పెళ్లి చేశారు. ఇప్పుడు నా ప్రమేయం లేకుండా మళ్లీ విడాకులు ఇస్తున్నారు. అంటూ ఆమె తన బాధను వెల్లబుచ్చుతుంది. చివరికి ఆ ఊరి పెద్ద ఆమెకు విడాకులు ఇస్తాడా? మొదటి భర్త దగ్గరికి ఈమె మళ్లీ వెళ్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘జీ5’ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న “హలాల్” (Halal) మూవీని తప్పకుండా చూడండి.

Tags

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×