Best Horror Movies on OTT : ఈరోజుల్లో హర్రర్ సినిమాల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ తో సహా చూసి ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. భయానక హర్రర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకొనే మూవీ లవర్స్ 5 భయంకరమైన సినిమాల గురించి తప్పకుండా చూడాల్సిందే. ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాలు మీకు వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
ది కంజురింగ్ (The Conjuring)
2013లో విడుదలైన హర్రర్ మిస్టరీ మూవీ ‘ది కంజురింగ్’ ప్రేక్షకులను బాగా భయపెట్టింది. దీనికి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, రాన్ లివింగ్‌స్టన్, లిల్లీ టేలర్ ప్రధాన పాత్రలలో కనిపించారు. దీని తర్వాత ఈ సినిమాకు చాలా సీక్వెల్స్ తెరపైకి వచ్చాయి. ఈ హారర్ మూవీని మీరు OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో చూడవచ్చు. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ చూసిన తర్వాత ఎంతటి ధైర్యవంతులైనా సరే వణికి పోవాల్సిందే. ఒంటరిగా ఈ మూవీని చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.
‘ఇన్‌సిడియస్’ (Insidious)
‘ఇన్‌సిడియస్’ కూడా ఒక హర్రర్ మిస్టరీ చిత్రం. ఇందులోని చాలా భాగాలు ఇప్పటివరకు విడుదలయ్యాయి. హర్రర్ సినిమా ప్రేమికులు ‘ఇన్‌సిడియస్’ ఫ్రాంచైజీకి చెందిన దాదాపు అన్ని చిత్రాలను బాగా ఆదరించారు. ఓటిటి ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ (sonyliv), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ హర్రర్ మిస్టరీ మూవీని చూడవచ్చు.
‘అండర్ ది షాడో’ (Under the shadow)
2016లో విడుదలైన ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ ప్రియులను బాగా అలరించింది. ఈ సినిమా కథ తల్లీ కూతుళ్ల చుట్టూ తిరుగుతుంది. తన కుమార్తె దెయ్యాల నీడలో ఉందని కొంతకాలం తర్వాత తల్లికి తెలుస్తుంది. ఆ తల్లి కూతుర్లను ఎలా కాపాడిందో తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఈ చిత్రం IMDbలో 6.8 రేటింగ్‌ను పొందింది. దీనిని నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో చూడవచ్చు.
‘ది వైలింగ్’ (The wailling)
2016 సంవత్సరంలో విడుదలైన ‘ది వైలింగ్’ ఒక కొరియన్ హర్రర్ చిత్రం. దీనిని మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), జియో సినిమా (jiocinema)లో చూడవచ్చు. ఒక అపరిచిత వ్యక్తి గ్రామానికి వచ్చిన తర్వాత, ఒక భయంకరమైన వ్యాధి వ్యాపిస్తుంది. ఈ సినిమాలో ఒక పోలీసు తన కూతురిని రక్షించడానికి ఆ భయంకరమైన వ్యాధి మిస్టరీని ఛేదించవలసి వస్తుంది.
ఈవిల్ డెడ్ (Evil Dead)
ఈ హర్రర్ మూవీని ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఈ మూవీ పేరు ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని కథ మిమ్మల్ని భయంతో వణికిస్తుంది. ఈ చిత్రంలో కొంతమంది స్నేహితులు అడవిలోని ఒక క్యాబిన్‌లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత వారికి ఏమి జరుగుతుందో చూస్తే గుండ దడ తప్పదు. ఆ సన్నివేశాలను మాత్రం సినిమాలోనే చూడాలి. ఎందుకంటే ఈ మూవీ ఒక రేంజ్ లో మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.