E-Paper
Advertisement

OTT Movie : హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ… Imdbలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ… Imdbలో అదిరిపోయే రేటింగ్
Advertisement

OTT Movie : ప్రతీవారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు కాకుండా ఇంతకు ముందే రిలీజ్ అయి imdbలో మంచి రేటింగ్ తెచ్చుకున్న సినిమాల కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. పైగా ఇందులో తెలుగు హీరోయిన్ హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ రొమాంటిక్ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో… 

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పక్కా తెలుగు రొమాంటిక్ సినిమా. పైగా ఇందులో కామెడీ కూడా ఉంటుంది. హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్ గా నటించగా, 20 వెడ్స్ 30 ఫేమ్ చైతన్యరావు హీరోగా నటించాడు. ఈ ఏడాది జూన్ 21న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తెరపై ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. కానీ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో మాత్రం ఈ సినిమాకు 8.7 రేటింగ్ రావడం విశేషం. ఇక ఇలాంటి సినిమా ఎలాంటి సందడి లేకుండా ఓటీటీ లోకి రావడంతో మూవీ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ప్రతి ప్రేమ జంట మధ్య వచ్చే సమస్యలను ఈ సినిమాలో కూడా ప్రస్తావించారు. హీరో హీరోయిన్ ఇద్దరూ ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి వైపు అడుగులు వేస్తారు. అయితే ప్రేమించుకున్నప్పుడు బాగానే ఉన్న ఈ జంట పెళ్లయ్యాక మాత్రం సమస్యల్లో చిక్కుకుంటుంది. దీంతో కౌన్సిలింగ్ కు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక వీళ్లిద్దరి మధ్య గొడవలు చూసిన ఓ వృద్ధ జంట ఆ కొత్త దంపతులు ఇద్దరినీ హనీమూన్ రిసార్ట్ కి వెళ్ళమని చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట విని వీరిద్దరూ కలిసి హనీమూన్ రీసార్ట్ కి వెళ్తారు. అసలు ఆ హనీమూన్ రీసార్ట్ ఏంటి? ఈ న్యూ కపుల్ కి ఆ వృద్ధ జంట ఎందుకు ఈ రీసార్టుకు వెళ్ళమని చెప్పారు? మరి అక్కడికి వెళ్ళాకైనా వీరిద్దరి సమస్యలు తగ్గాయా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ‘హనీమూన్ ఎక్స్ప్రెస్‘ అనే ఈ సినిమాను చూసి తీరాల్సిందే. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటిలో మాత్రం బాగానే ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఎంతగా ట్రెండ్ అయ్యిందంటే ఏకంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్లింది. ఈ కేజీ మూవీకి బాల రాజశేఖరుని దర్శకత్వం వహించగా, కేకేఆర్, బాలరాజ్ ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో హెబ్బా పటేల్, చైతన్య రావు మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే హెబ్బా పటేల్ కోసమైనా ఓసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది సినిమా. కాబట్టి ఈ వీకెండ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాను మిస్ అవ్వకుండా చూడండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన కపుల్ డోంట్ మిస్.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×