OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఉత్కంఠభరితంగా చూస్తూ ఉంటారు. రోబోలని మనుషుల ప్లేస్ లో రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సస్పెన్స్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “వైఫ్ లైక్” (Wife Like) ఈ మూవీలో హీరో తన భార్య ప్లేస్ లో ఒక రోబో ని తెచ్చుకుంటాడు. ఆ రోబోతో అన్ని విధాలుగా అనుభూతులు పొందుతూ ఉంటాడు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
విలియమ్స్ రోబోలను తయారుచేసే ఒక కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీలో రోబోలను తమకు నచ్చిన వాళ్ళలాగా ప్రోగ్రాం చేసి వాడుకోవడానికి, ఆ కంపెనీతో కొంతమంది అగ్రిమెంట్ చేసుకొని రోబోలను తీసుకుంటూ ఉంటారు. ఆ రోబోలను ఎవరైనా దొంగతనం చేస్తే, ప్రమాదానికి గురైతే విలియమ్స్ వాటిని రికవరీ చేసి తిరిగి కంపెనీ కి అప్పజెప్తూ ఉంటాడు. ఇలా ఒక రోజు విలియమ్స్ తన భార్యని మిస్ అవుతున్న విషయాన్ని గమనించిన కంపెనీ యజమాని, అతనికి ఒక రోబోని బహుమతిగా ఇస్తాడు. అది అచ్చం తన భార్యని పోలి ఉంటుంది. విలియమ్స్ భార్య చనిపోయి ఉండటంతో, ఆ రోబోని విలియమ్స్ తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ రోబో కి మెరిడిత్ అనే తన భార్య పేరుని పెడతాడు. తన భార్య విలియమ్స్ తో ఎలా ఉంటుందో ఆ విషయాలను రోబో కి వివరిస్తాడు. రోబో కి రొమాంటిక్ ఫీలింగ్ కూడా ఉండటంతో, ఏకాంతంగా కూడా గడుపుతాడు విలియమ్స్.
ఒకరోజు రోబో స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళి కలకంటూ ఉంటుంది. రోబో కి ఒక మాస్క్ మ్యాన్ కనపడుతూ, ఏదో విషయంపై హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న విలియమ్స్ తను కూడా వెళ్లి అతను ఎవరో కనిపెట్టాలని చూస్తాడు. అయితే అతను ఎవరో తెలుసుకోకుండానే మళ్లీ కలలో నుంచి బయటికి వస్తారు. రోబో ఒకసారి విలియమ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది. తనకు తానుగా ఆలోచించడం మొదలు పెట్టిన రోబో, విలియమ్స్ తన భార్యని తనే చంపాడానే విషయం తెలుసుకుంటుంది. ఆ తరువాత రోబో విలియమ్స్ ను ఎలా ట్రీట్ చేస్తుంది? విలియమ్స్ ఈ రోబోలకు మెమరీలను ఎందుకు డిలీట్ చేస్తూ ఉంటాడు? సొంతంగా ఆలోచించగలిగే ఈ రోబో వల్ల ఏమైనా ప్రమాదాలు వస్తాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “వైఫ్ లైక్” (Wife Like) మూవీని తప్పకుండా చూడండి.