BigTV English

OTT Movie : జీవితంపై విరక్తి పుట్టి హీరో ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లాగవు… గుండెను మెలి పెట్టే ఎమోషనల్ మూవీ

OTT Movie : జీవితంపై విరక్తి పుట్టి హీరో ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లాగవు… గుండెను మెలి పెట్టే ఎమోషనల్ మూవీ

OTT Movie : థియేటర్లలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనసుకు హత్తుకుని గుర్తుండిపోతాయి. అటువంటి మూవీస్ చూస్తున్నంత సేపు కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ సినిమాలతో మన లైఫ్ ని కూడా పోల్చుకుంటాం. కొన్ని సినిమాలు చూడకపోతే ఎంత మిస్ అవుతామో ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇది ఒక హాలీవుడ్ మూవీ. డబ్బు, బంధాల మధ్య విరక్తి చెంది ప్రకృతి ఒడిలో నిద్రపోయే ఒక వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీ చూస్తే జీవితంలో గుర్తుండిపోతుంది. ఈ మూవీ పేరు “ఇన్ టు ద వైల్డ్” (In to the wild) ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో చదువులో అందరికన్నా ముందు ఉంటాడు. ఇతని తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఇతనికి ఒక అక్క కూడా ఉంటుంది. హీరో చదువుకునే రోజుల్లో తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అయితే గర్ల్ ఫ్రెండ్ అంటే ఏకాంతంగా గడపడమే అనుకునే కొంతమంది మూర్ఖులకు, ఈ మూవీలో గర్ల్ ఫ్రెండ్ ని హీరో ఎలా ట్రీట్ చేస్తాడో మూవీ చూస్తే తెలుస్తుంది. అయితే హీరో ఈ సమాజంలో ఇమడలేక తన దగ్గర కొంత డబ్బు ఉంటే దానిని ఒక చారిటీకి ఇచ్చి, అలస్కాలోని పర్వత ప్రాంతానికి బయలుదేరుతాడు. దారిలో అతని కారు రిపేర్ అయితే దీనిని బాగు చేసుకుని ఎవరైనా వాడుకోండి అని రాసి వెళ్లిపోతాడు. అతడు ఆ పర్వత ప్రాంతానికి వెళ్లిన తర్వాత అక్కడున్న చేపలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ తన జీవితాన్ని గడుపుతాడు. ఈ మూవీలో ఎన్నో సన్నివేశాలు ఆలోచింపచేస్తాయి. చివరిగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టక మానరు.

కొడుకు రాక కోసం తండ్రి ఏ విధంగా బాధపడుతున్నాడో మూవీ చూసే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎందుకంటే ఈ మూవీలో హీరో చివరికి చనిపోతాడు. చనిపోయే ముందు తను జీవితంలో జర్నీ చేసిన విషయాలు గుర్తుకు వస్తాయి. త్వరగా నేను తిరిగి వెళ్తే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారు అనే విషయాన్ని అతడు ఊహించుకుంటూ ఉంటే ఆ దృశ్యం మాటల్లో చెప్పలేనిది. అలా ఊహించుకుంటూనే తను ఆకాశం వైపు చూస్తూ చనిపోతాడు. ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. డబ్బు, కుట్రలు, కుళ్ళిపోయిన సమాజం చుట్టూ జీవితాలను గడిపేస్తున్న మనుషులు ఒక్కసారైనా ఈ మూవీ ని చూస్తే కాస్తయినా జీవితంలో రిలాక్స్ అవుతారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×