BigTV English

OTT Movie : లేడీ డాక్టర్ ప్రైవేట్ వీడియోలు లీక్… దృశ్యం లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : లేడీ డాక్టర్ ప్రైవేట్ వీడియోలు లీక్… దృశ్యం లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఈ చిత్రాలు కొద్దిరోజుల్లోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ను ప్రేక్షకులు కళ్ళార్పకుండా వీక్షిస్తారు. దృశ్యం సినిమా ఇందుకు ఒక ఉదాహరణ. ఇదే తరహాలో ఓటిటిలో ఒక చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ మూవీ. ఇందులోని సన్నివేశాలు చాలా ట్విస్టులు కలిగి ఉంటాయి. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీ లలో

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ ఒక మలయాళం మూవీ. ఈ మూవీ థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టి ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు “ఇని ఉత్తరం“ini utharam”. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్  ఈటీవీ విన్, జి 5 లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ చిత్రం మొదలవగానే హోమ్ మినిస్టర్ ని చూపిస్తారు. క్రయాన్ అనే ఫ్యాక్టరీ విషయంలో హోమ్ మినిస్టర్ ఒక ఎస్పీతో సమావేశం అవుతాడు. ఎస్పీ తండ్రి హోమ్ మినిస్టర్ కి ఒకప్పుడు అనుచరుడిగా ఉండేవాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఆ క్రయాన్ ఫ్యాక్టరీ మూసివేత గురించి చర్చించుకుంటూ ఉంటారు. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ జానకి వృత్తిరీత్యా ఒక డాక్టర్. ఈమె వైల్డ్ ఫోటోగ్రాఫర్ అయిన అశ్విన్ ను లవ్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. ఇంట్లో పెద్దలు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపి పెళ్లి చేసుకోవాలని సూచిస్తారు. ఒకరోజు హీరో బైక్ ను ఎవరో దొంగలిస్తారు. కొద్దిరోజుల తర్వాత ఆ బైక్ ను పోలీసులు పట్టుకొని హీరోకి అప్పగిస్తారు.

ఆ ఊరి పోలీస్ స్టేషన్లో సీఐ కరుణన్ విధులు నిర్వహిస్తాడు. అతడు క్రయాన్ ఫ్యాక్టరీ లో గొడవలను చేసే వ్యక్తులతో కుమ్మక్కై ఉంటాడు. హీరోయిన్ జానకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులకు నేను ఒక హత్య చేశాను అని చెప్తుంది. పోలీసులు ఆమె చెప్పే విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఎందుకంటే ఆమె డిప్రెషన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటుంది. అది చూసి ఈమెకు మెంటల్ వుందేమో మన టైం వేస్ట్ చేస్తుందని అనుకుంటారు. అయితే ఆమె గట్టిగా అరచి నేను హత్య చేశాను, నేను ఒక డాక్టర్ని, ఆ శవాన్ని అడవిలోని ఒకచోట పాతిపెట్టాను అని చెప్తుంది. ఎందుకు హత్య చేశావని సిఐ ఆమెను అడగగా… అతను నా స్నేహితుడే, గత కొంతకాలంగా నా ప్రైవేట్ ఫొటోస్ సీక్రెట్ గా తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అందుకే అతనిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి చంపేశాను అని చెప్తుంది.

ఆమె చెప్పేది వింటుండగా అక్కడికి ప్రెస్ వాళ్లు కూడా వస్తారు. ఇంతలోనే మీడియాకి ఎలా తెలిసింది ఈ విషయం అని సీఐ సందేహ పడతాడు. ఇప్పుడే కంప్లైంట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తామని వారికి చెప్తాడు. అసలు సురేష్ అనే స్నేహితుడిని ఈమె ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆమె చెప్పింది నిజమేనా? క్రయాన్ ఫ్యాక్టరీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? పోలీసులు ఈ కేసు చిక్కుముడి విప్పుతారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×