OTT Movie : ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలు చూస్తున్నంత సేపు మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ సినిమాలలో లవ్ స్టోరీని ఒక రేంజ్ లో చూపిస్తారు మేకర్స్. అందులోనూ టీచర్, స్టూడెంట్ లవ్ స్టోరీ అంటే ఇంట్రెస్ట్ గా చూస్తారు మూవీ లవర్స్. ఇదివరకే ఇటువంటి కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ కొరియన్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ఇన్నోసెంట్ థింగ్‘ (Innocent thing). ఈ మూవీలో హీరోకి ఇదివరకే పెళ్లి అయి ఉంటుంది. స్కూల్లో ఒక విద్యార్థి హీరోని ప్రేమిస్తుంది. వీళ్ళ ముగ్గురు మధ్య స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక కాలేజ్ లో స్పోర్ట్స్ టీచరుగా పని చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇదివరకే పెళ్లి అవ్వడంతో పాటు, భార్య కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది. అయితే స్కూల్లో ఒక విద్యార్థి హీరోని బాగా ఇష్టపడుతుంది. ఎంతలా అంటే అతని కోసం ఏమైనా చేసే అంతలా ప్రేమ పెంచుకుంటుంది. హీరోతో ఎక్కువ సమయం గడుపుతూ తన ప్రేమను పొందాలని చూస్తుంది. అయితే హీరో తనకి ఇదివరకే పెళ్లయిందని పద్ధతి మార్చుకోమని చెప్తాడు. మరోవైపు ఆ స్టూడెంట్ హీరో ఇంటికి కూడా వస్తుంది. హీరో భార్యతో ట్యూషన్ చెప్పాలని అడుగుతుంది. ఆ అమ్మాయి తనని ప్రేమిస్తుందని హీరో, హీరోయిన్ కి చెప్తాడు. చిన్నపిల్లలు ఇలా అట్రాక్ట్ అవ్వడం మామూలే అంటూ లైట్ తీసుకుంటుంది హీరో భార్య. ఒకరోజు స్కూల్లో ఇద్దరు ముద్దు పెట్టుకునే వరకు వెళ్తారు. ఆ సమయంలో స్టూడెంట్ ఎంతలా అనుభూతి చెందిందో సీక్రెట్ గా రాసుకుంటుంది. ఈ విషయం మిగతా పిల్లలకు తెలుస్తుంది. స్కూల్ ప్రిన్సిపాల్ ఆ అమ్మాయిని పిలిచి ఇదంతా నిజమా అని అడుగుతాడు. నేను ఊహించి రాసుకున్నానని, టీచర్ కి ఇందులో సంబంధం లేదు అని చెప్తుంది స్టూడెంట్. హీరోని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ పంపిస్తాడు ప్రిన్సిపాల్.
ఒకరోజు స్టూడెంట్ హీరోయిన్ ఇంట్లో వామిటింగ్స్ చేసుకుంటుంది. తనకు మూడోనెల అంటూ హీరో భార్యతో చెబుతుంది. ఆమె కంగారుపడి తనకు మత్తు ఇచ్చి హాస్పిటల్ కి తీసుకు వెళ్తుంది. అక్కడ టెస్ట్ చేయగా తను ఇదివరకు ఎవరితోనో ఫిజికల్ గా కలవలేదని చెప్తారు. ప్రెగ్నెన్సీ లేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటుంది హీరో భార్య. ఆ తరువాత హీరోకి కొద్దిరోజుల్లోనే పిల్లాడు పుడతాడు. స్టూడెంట్ పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోతుంది. హీరో భార్యని ఒక ట్యాంకర్ లో బ్లాక్ చేస్తుంది. హీరో స్టూడెంట్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ అడుగుతాడు. అప్పటికే ఒక బిల్డింగ్ పైనుంచి దూకడానికి స్టూడెంట్ సిద్ధంగా ఉంటుంది. చివరికి స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి దూకేస్తుందా? హీరో భార్య పిల్లలు సేఫ్ గా ఉంటారా? హీరో స్టూడెంట్ని నిజంగానే ప్రేమిస్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడాల్సిందే.