BigTV English

Top Tollywood Grossers 2024 : ఈ ఏడాదిలో హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన మూవీస్..

Top Tollywood Grossers 2024 : ఈ ఏడాదిలో హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన మూవీస్..

Top Tollywood Grossers 2024 : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సినిమాల పంట పండింది.. బాక్సాఫీస్ నుంచి రిలీజ్ అయిన ప్రతి సినిమా టాక్ తో పనిలేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నాయి.. జనవరి నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు జనాల నుంచి మంచి ఆదరణ పొందాయి.. హైయెస్ట్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలు అంటే ఎక్కువగా పుష్ప 2 పేరే వినిపిస్తుంది.. హైయెస్ట్ గ్రాస్ వసూల్ చేసిన సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం..


పుష్ప 2.. 

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 1760 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.. ఇదే జోరు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక 2024 బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన ‘పుష్ప 2’ మూవీ ఖాతాలో చాలా రికార్డులు వచ్చి చేరాయి. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఆల్ టైం సినిమాల జాబితాలో మూడో స్థానంలోకి ఈ మూవీ వచ్చింది.. జనవరి తొమ్మిది వరకు ఇదే జోరు కొనసాగితే 2వేల కోట్లు రాబట్టడం పక్కా అని ట్రేడ్ పంతుళ్లు చెబుతున్నారు.


కల్కి 2898ఏడీ..

పుష్ప 2 తర్వాత స్థానంలో కల్కి ఉంది. 1200 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం కలెక్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. అలాగే ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. నెక్స్ట్ఈ మూవీకి కొనసాగింపుగా రాబోతున్న ‘కల్కి పార్ట్ 2’ బడ్జెట్ కూడా 600 కోట్లపైనే ఉండబోతోందని తెలుస్తోంది..

స్త్రీ 2..

2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో మూడో స్థానంలో బాలివుడ్ మూవీ స్త్రీ 2 ఉంది. అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం మరో రికార్డ్ ని అందుకుంది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 874.58 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది..

ఇక ఈ ఏడాది తెలుగులో మూడో స్థానంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఉంది. నాలుగో స్థానంలో తేజా సజ్జ హనుమాన్ మూవీ ఉంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవి ఉంది.. ఇవే కాదు ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టాయి.. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.. అలాగే సమ్మర్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×