BigTV English

OTT Movie : ఆ ఊళ్ళో పూజ చేస్తే డైరెక్ట్ నరకానికే.. భయంతో చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : ఆ ఊళ్ళో పూజ చేస్తే డైరెక్ట్ నరకానికే.. భయంతో చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటిలోకి వచ్చిన ఒక హర్రర్ మూవీ మంచి టాక్ తో దూసుకెళ్తోంది. మరి ఈ సినిమా పేరేంటి? ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


4 నెలల తరువాత ఓటీటీలోకి.. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హర్రర్ మూవీ ఈ ఏడాది మే 31న థియేటర్లలో రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ కలెక్షన్ పరంగా నిర్మాతలను లాభాల్లో పడేసింది. ఉమాంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఆలస్యం కాగా, థియేటర్లలో రిలీజ్ అయిన 4 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. ‘షెమారోమీ’ అనే ప్లాట్ఫామ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. అక్టోబర్ 17 నుంచి ఈ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్లతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను సౌల్ సూత్ర, ఆర్డి బ్రదర్స్ బ్యానర్లపై మానసి పరేఖ, పార్థివ్ కోహ్లీ నిర్మించారు. సినిమాలో ఉండే ట్విస్టులు, కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఈ మూవీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ (disney plus hotstar)లో త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం.


కథలోకి వెళ్తే…

ఇది గుజరాత్ సినిమా కాబట్టి అక్కడి నేపథ్యంలోనే ఉంటుంది. గుజరాత్ లో ఉన్న రాణివాడ అనే ప్రాంతంలో నవరాత్రుల సంబరాలు జరగవు. నిజానికి గుజరాత్ లో నవరాత్రుల్లో గర్భా అనే వేడుకను ఘనంగా జరుపుకుంటారు. కానీ ఆ ఊరిలో మాత్రం జామ్ కుడి అనే దయ్యం శాపం వల్ల గర్భా నిర్వహించరు. ఒకవేళ ఈ పూజని ఎవరైనా చేయాలనుకున్నా అక్కడి జనం భయపడతారు. అయితే ఒకానొక టైంలో ఈ రూల్ ని ధిక్కరించడంతో జామ్ కుడి దయ్యం మరోసారి ఆ వూర్లో వేటను మొదలు పెడుతుంది. దీంతో ఆ శాపాన్ని అదుపు చేయడానికి బయట నుంచి ఓ వ్యక్తిని పిలిపిస్తారు. ఆ వ్యక్తి ఎవరు? మరి ఈ శాపం నుంచి రాణి వాడా బయట పడగలిగిందా? బబ్లూ ఈ మిస్టరీని ఛేదించగలిగాడా? అసలు జామ్ కుడి అనే ఈ దయ్యం కథ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే జామ్ కుడి (Jhamkudi) అనే ఈ హర్రర్ మూవీని చూడాల్సిందే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న విరాజ్ గలాని ఈ సినిమాతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సంజయ్ గోరాడియ, రోజా శ్రవణ్, క్రునాల్ పండిట్, చేతన్ ధైర్య, భవాని జానీ, జయేష్మర్ కీలక పాత్రలలో నటించారు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఓ లుక్ వెయ్యండి. ముఖ్యంగా హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×