E-Paper
Advertisement

OTT Movie : మెదడుకు పదును పెట్టే బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇవే

OTT Movie : మెదడుకు పదును పెట్టే బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇవే
Advertisement

OTT Movie : ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు చూస్తున్నంతసేపు థ్రిల్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఈ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం పదండి.

జాన్ లూథర్ (John Luther)

Advertisement

2022లో విడుదలైన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అభిజిత్ జోసెఫ్ దర్శకత్వం వహించగా, జయసూర్య ప్రధాన పాత్రలో నటించాడు. విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు ఈ మూవీ అందుకొంది. జాన్ లూథర్ 27 మే 2022న విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ వరుస హత్యలు చేసిన సైకో కిల్లర్ ని పట్టుకొనే క్రమంలో స్టోరీ రన్ అవుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.

రాఘవన్ (Raghavan)

Advertisement

2006లో వచ్చిన వెట్టయ్యాడు విలయ్యాడు అనే ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కమల్ హాసన్, జ్యోతిక, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్, డేనియల్ బాలాజీ, సలీం బేగ్ నటించారు. ఈ మూవీ డిసిపి రాఘవన్ చుట్టూ తిరుగుతుంది, అతను ఇద్దరు సీరియల్ కిల్లర్‌లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. హారిస్ జయరాజ్ ఈ మూవీకి సంగీతం అందించారు. వేట్టయ్యాడు విలయ్యాడు 25 ఆగస్ట్ 2006న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా  పొందారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

చక్రవ్యూహ (Chakravyuh)

2012 లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రకాష్ ఝా దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ రాంపాల్, అభయ్ డియోల్, ఈషా గుప్తా, మనోజ్ బాజ్‌పేయి, అంజలీ పాటిల్ నటించారు. చక్రవ్యూహ లక్ష్యం నక్సలైట్ల సమస్యపై చైతన్యం కలిగిస్తుంది. మంచి ప్రశంసలు ఈ మూవీ అందుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్లాన్ B (Plan B)

2021 లో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీకి నటాలీ మోరేల్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విక్టోరియా మోరోల్స్, కుహూ వర్మ నటించారు. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ బ్రాండ్ పేరుతో దీనికి టైటిల్ పెట్టారు. ఇది సినిమా కథాంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సోనీ లివ్ (Sonyliv) లో స్ట్రీమింగ్ అవుతోంది.

నీవెవరో (Neevevaro)

2018లో విడుదలైన ఈ మూవీకి హరి నాథ్ దర్శకత్వం దర్శకత్వం వహించారు. కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ నిర్మించారు. ఈ మూవీలో ఆధీ, తాప్సీ పన్నూ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. అంధుడి గా వున్న హీరో, కనిపించకుండా పోయిన హీరోయిన్ కోసం వెతికే క్రమంలో స్టోరీ మూవ్ అవుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×