OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ ప్లాట్ ఫామ్ లో అన్ని జోనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే పుష్ప : 2 లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అటువంటి సినిమాలు ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో? ఆ సినిమాల పేర్లు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
కల్కి 2898 ఏ.డీ (Kalki 2898 A.D)
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 2024, జూన్ 27న రిలీజ్ అయింది. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ హిందూ పురాణాల నుండి ప్రేరణ పొంది అత్యంత భారీ బడ్జెట్ ₹600 కోట్లతో కల్కి ని తెరకెక్కించారు. ల్యాబ్లో ఒక అమ్మాయికి పుట్టబోయే బిడ్డ కల్కిని రక్షించే లక్ష్యం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ప్రభాస్ ,అమితాబ్ యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీకి హైప్ తెచ్చాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆర్ ఆర్ ఆర్ (R R R)
స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా ఈ మూవీకి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయి సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. 2022 మార్చి 25 రిలీజ్ అయిన ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ చేరుకుంది. జపాన్ లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix), 5(zee5) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
హనుమాన్ (Hanu man)
2024లో విడుదలైన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 2024 జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా (Jio cinema) జీ 5 (zee5) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
సలార్ (Salaar)
ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, శృతి హాసన్ హీరో, హీరోయిన్ లుగా నటించారు.హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మించారు. హీరో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపే కధతో ఈ మూవీ నడుస్తుంది. ఈ మూవీ 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.