BigTV English

OTT MOVIE : ఆమెను చంపింది అతడే.. ముసలోడికి షాకిచ్చిన డిటెక్టివ్

OTT MOVIE : ఆమెను చంపింది అతడే.. ముసలోడికి షాకిచ్చిన డిటెక్టివ్

OTT MOVIE : క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఒకప్పుడు నవలల రూపంలో ఉండే బుక్స్ ని చదివే వాళ్ళం. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ స్టోరీని చదివే వాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ మీడియాలో చూస్తున్నాం. థ్రిల్లర్ మూవీలను సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో అలా చూస్తున్నప్పుడు వచ్చే మజా కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. అటువంటి ఒక క్రైం థ్రిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ మూవీ పేరు మరేమిటో కాదు “కైండ్ ఆఫ్ మర్డర్” (Kind of murder). ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉంటాయి. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది.


స్టోరీ లోకి వెళితే

మార్టిన్ అనే వ్యక్తి మూవీ చూడటానికి థియేటర్ కి వెళ్తాడు. థియేటర్ లోకి అతనికి పరిచయం ఉన్న టోనీ అనే కుర్రాడు వస్తాడు. ఒకరిని ఒకరు పలకరించుకుంటారు. మరోవైపు హీరోయిన్ కంగారుగా నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడికి హీరో వస్తాడు. తను రాసిన బుక్ ను ఆమెకు ఇస్తూ ఉండగా, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు నేను వెళ్తున్నాను ఇప్పుడు ఈ బుక్ అవసరమా అని అతనికి చెప్పి వెళ్ళిపోతుంది. అతడు కూడా సరే అని ఆమెను బస్సులో డ్రాప్ చేస్తాడు. అప్పుడే ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా అందులో హైవేలో ఒక ముసలామె చనిపోయిన స్టోరీని చదువుతాడు హీరో.  ఆ పేపర్ ని తీసుకొని దానితో ఒక కథ రాయాలని అనుకుంటాడు. మరోవైపు హీరోయిన్ ఎక్కిన బస్సు హైవే మీదుగా వెళ్ళదు వేరే రూట్ లో వెళుతుందని బస్ డ్రైవర్ చెప్తాడు.

ఎందుకంటే హైవేలో ఒక ముసలామె మర్డర్ జరిగింది. అక్కడ పోలీసులు ఉన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మార్టిన్ దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఎందుకంటే చనిపోయిన ముసలామె మార్టిన్ భార్య. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఇతని మీద అనుమానం ఉంటుంది. ఆమె చనిపోయిన వెంటనే ఇతను సినిమాకి వెళ్లడం వలన అతనికి అనుమానం మరింతగా పెరుగుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆఫీసర్ కి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు ఏమిటి? ముసలామెను చంపింది ఎవరు? హీరో ఆ హత్యను కథగా ఎందుకు రాయాలనుకున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్  అవుతున్న కైండ్ ఆఫ్ మర్డర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లతో మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది.

Related News

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

Big Stories

×