BigTV English
Advertisement

SSMB29 : ఏంటి నిజమా.. మహేష్ బాబు అందుకే జుట్టును పెంచాడా..?

SSMB29 : ఏంటి నిజమా.. మహేష్ బాబు అందుకే జుట్టును పెంచాడా..?

SSMB29 : ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు మహేష్.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ సినిమాకు ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు. దర్శక ధీరుడు రాజమౌళి ( Rajamouli) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. కానీ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. దీని పై మహేష్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే మహేష్ లుక్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఆ చిత్రానికి తగ్గా లుక్, ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మహేష్ చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నట్లు టాక్. మరి ఆ సినిమా ఏంటి? నిజంగానే మహేష్ ఆ రోల్‌కి ఓకే చెప్పారా? అనేది తెలుసుకుందాం..

విషయానికొస్తే.. అశోక్‌ గల్లా( Asok Galla) హీరోగా నటిస్తోన్న ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం నవంబర్ 14 న రిలీజ్ కాబోతుంది. ‘హనుమాన్‌’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందించారు. ఈ సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.. ఆ మూవీలో ప్రిన్స్ కృష్ణుడు పాత్రలో కనిపించునున్నారని టాక్.. ఒకవేళ ఇదే నిజమైతే సినిమా క్లైమాక్స్‌లో మహేష్ కృష్ణుడి అవతారంలో కనిపిస్తారన్నమాట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇప్పుడు జక్కన్న సినిమాలో మహేష్ బాబు లుక్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..


ఇక ప్రస్తుతం రాజమౌళి తో చేస్తున్న సినిమా కోసం మహేష్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం గుబురు గడ్డం, పొడవాటి జుట్టు ఉన్న లుక్‌ లోకి మారారు మహేష్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ అవ్వాలంటే మరో ఐదేళ్లు ఈజీగా పట్టే అవకాశం ఉంది. కానీ ఈలోపే తన ఫ్యాన్స్‌కి మహేష్ ఓ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అదేంటంటే ఓ సినిమా లో మహేష్ బాబు కేమియో చెయ్యనున్నారని టాక్.. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఈ వార్తలకు ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఈ వార్తలకు ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.. ఏది ఏమైనా రాజమౌళి తో సినిమా కమిట్ అయితే మాత్రం వెయిటింగ్ తప్పదు.. ఎన్నేళ్లు పడుతుందో, ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కష్టమే..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×