BigTV English

OTT Movie : ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలంటే ఆ పని చేయాలంటూ కండిషన్ పెట్టే కాబోయే మామ

OTT Movie : ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలంటే ఆ పని చేయాలంటూ కండిషన్ పెట్టే కాబోయే మామ

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్ది రోజులలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ కొన్ని మాత్రమే ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇప్పుడు అలా ఎంటర్టైన్ చేయడంలో మలయాళం మూవీస్ ముందు వరుసలో ఉన్నాయి. దృశ్యం లాంటి మూవీస్ వచ్చిన తర్వాత మలయాళం మూవీస్ కి ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. అటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “కోచల్” (Kochal). ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ట్విస్టులతో మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.


స్టోరీ లోకి వెళితే

రాజన్ అనే కానిస్టేబుల్ కి శ్రీ కొట్టం అనే కొడుకు ఉంటాడు. శ్రీ కొట్టం కాస్త పొట్టిగా ఉంటాడు. అతనికి పోలీస్ కావాలని ఆశ ఉంటుంది. అయితే అతని హైట్ అతనికి శాపంగా మారుతుంది. మరోవైపు అన్నమ్ అనే యువతని శ్రీ కొట్టం ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తండ్రి శ్రీ కొట్టంకు, ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. మరోవైపు ఆ ఊరిలో పైలి అనే పెద్దమనిషి వడ్డీకి పైసలు ఇస్తూ, ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇతని దగ్గర బాబు అనే వ్యక్తి దాదాగిరి చేస్తూ ఉంటాడు. ఆ పైలి దగ్గర అన్నమ్ తండ్రి కొంత పొలాన్ని తాకట్టు పెట్టి ఉంటాడు. ఆ పొలం అతనికి ఇవ్వకుండా పైలి ఇబ్బంది పెడతాడు.

ఒకరోజు అన్నమ్ కు బాబు అనే వ్యక్తి యాక్సిడెంట్ చేస్తాడు. ఆమె హాస్పిటల్లో ఉండగా ఆమె దగ్గరకు వచ్చి పొలం దగ్గరకు వస్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తాడు. ఈలోగా శ్రీ కొట్టం తండ్రి ఆక్సిడెంట్ లో చనిపోగా, అతని జాబ్ శ్రీ కొట్టం కి వస్తుంది. అన్నమ్ కు ఎవరివల్ల యాక్సిడెంట్ జరిగిందో తెలుసుకున్న శ్రీ కొట్టం, అతని కి తగిన గుణపాఠం చెప్తానని ఆమెతో చెప్తాడు. ఈలోగా పైలా దారుణంగా హత్యకు గురవుతాడు. ఇంతకీ పైలాను దారుణంగా ఎవరు హత్య చేశారు? పోలీసులు ఈ హత్య కేసును చేదించారా? శ్రీ కొట్టం కి అన్నమ్ తో వివాహం జరుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “కోచల్” (Kochal) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. మూవీ లవర్స్ ను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×