BigTV English

OTT Movie : శాడిస్ట్ భర్త నుంచి తప్పించుకోబోయి కిల్లర్ చేతిలో పడే అమ్మాయి… వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ మూవీ

OTT Movie : శాడిస్ట్ భర్త నుంచి తప్పించుకోబోయి కిల్లర్ చేతిలో పడే అమ్మాయి… వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ మూవీ

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు ఎలా ఎంటర్టైన్ చేస్తాయో అందరికీ తెలిసిందే. అందులోనూ మలయాళం నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటీటీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటో? స్టోరీ ఏమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video)

ఈ మూవీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “లెవెల్ క్రాస్” (Level Cross). శాడిస్ట్ భర్తను హీరోయిన్ ఎలా ఎదుర్కొంది. అతనిని ఎదుర్కొనే క్రమంలో హీరోయిన్ ఒక కిల్లర్ చేతికి చిక్కడంతో స్టోరీ ముందుకు వెళుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనేక ట్విస్టులతో మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం “అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒక సైకాలజిస్ట్ గా ఉంటూ ఒక పేషెంట్ లో మార్పు తీసుకొస్తుంది. ఆ క్రమంలో పేషెంట్ ను హీరోయిన్ ప్రేమిస్తుంది. ఇద్దరూ ఒకరినిఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కొద్దిరోజుల తర్వాత అతని  అసలు రూపం బయటకి తెలుస్తుంది. అతను డ్రగ్స్ కు అలవాటుపడి హీరోయిన్ ని టార్చర్ చేస్తాడు. ఒకసారి ట్రైన్లో జర్నీ చేస్తుండగా ఆమెను చంపే ప్రయత్నం చేస్తాడు. అయితే హీరోయిన్ భయపడి ఆ ట్రైన్ నుంచి కిందకు దూకేస్తుంది. అయితే ఆమె ఒక ఎడారి ప్రాంతంలో దూకడంతో అక్కడ ఎవరూ ఉండరు.  ట్రైన్ వెళ్లే దారిలో ఒకే ఒక గేట్ కీపర్ మాత్రమే ఉంటాడు. అతడు హీరోయిన్ ను కాపాడి ఆమెకు సహాయపడతాడు. ఎవరూ లేని ప్రాంతంలో ఇతను ఎలా ఉన్నాడని హీరోయిన్ అతన్ని అనుమానంగా చూస్తుంది. అయితే అతను కూడా తన కుటుంబంలో ఎవరినో చంపి ఇక్కడికి వచ్చినట్టు పేపర్లో ప్రకటన చూస్తుంది హీరోయిన్.

నిజానికి అతడు గేట్ కీపర్ కాదని, అసలు గేట్ కీపర్ ని చంపి అతని ప్లేస్ లో ఇతడు ఉన్నాడని గ్రహిస్తుంది. అయితే ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో అతనిని బెదిరించడానికి ట్రై చేస్తుంది. అతను భయపడకుండా తన స్టోరీ మొత్తం హీరోయిన్ కు చెబుతాడు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. అయితే ఈ క్రమంలో హీరోయిన్ కు అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ గేట్ కీపర్ చేతిలో హీరోయిన్  ఏమవుతుంది? ఆమె భర్త మళ్లీ అక్కడికి తిరిగి వస్తాడా? హీరోయిన్ మామూలు జీవితం గడుపుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ “లెవెల్ క్రాస్” (Level Cross) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో అమలాపాల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా  మెప్పించింది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×