Pawan Kalyan: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే కెరియర్ మొదట్లోనే ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలో అందుకున్నాడు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అప్పటివరకు హీరోలు వేరు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్స్ వేరు అనే కొత్త రకంగా చేశాడు. యూత్ అంతా కూడా స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ ను చూస్తూ పవన్ కళ్యాణ్ లో వాళ్లను వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇకపోతే ఆ సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చి పెట్టాయి. అలానే పవన్ కళ్యాణ్ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, పోకిరి వంటి సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ రాసిన ప్రతి కథ ను పవన్ కళ్యాణ్ కి చెబుతూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ వాటిని వింటూ కూడా బాగున్నాయి అని చెబుతూ ఉండేవారు తప్ప ఎప్పుడు చేయలేదు.
పవన్ రిజెక్ట్ చేసిన చాలా కథలను రవితేజ పూర్తి చేసారు. ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి వంటి సినిమాలు రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ఆ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారట. అప్పట్లో పవన్ కళ్యాణ్ కి చెబుదామని చెప్పలేకపోయారు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ కి మరో కథ సిద్ధం చేశారు. ఆ కథ విన్న వెంటనే, నేను కిక్ సినిమా మిస్ అయ్యాను ఈ సినిమా నాకు మంచి కిక్ ఇచ్చింది. దీనిని ఏమీ మార్చకండి ఇలానే ఉంచండి మనం కచ్చితంగా చేద్దాం అంటూ మాటిచ్చారు. ఈ విషయాన్ని నిర్మాత రామ్ తల్లూరి తెలిపారు.
Also Read: Pushpa Item Song Leaked Pic : మార్ఫింగ్ ఫోటో వైరల్ చేసి, పుష్ప లీక్స్ అంటున్నారు.
వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ వాటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే పూర్తి చేశాడు. ఇంక దాదాపు 5 సినిమాల వరకు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో ఈ సురేందర్ రెడ్డి సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఇప్పట్లో జరుగుతుందని నాకు నమ్మకం లేదు అని నిర్మాత కూడా ఈ ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.