BigTV English

KA Movie Collections : వీకెండ్ భారీ పెరిగిన ‘ క ‘ కలెక్షన్స్.. నాలుగు రోజులకు ఎన్ని కోట్లంటే?

KA Movie Collections : వీకెండ్ భారీ పెరిగిన ‘ క ‘ కలెక్షన్స్.. నాలుగు రోజులకు ఎన్ని కోట్లంటే?

KKA Movie Collections : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క ‘.. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మొగిస్తుంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ క మూవీకి రోజు రోజుకు ఆదరణ బాగా పెరుగుతుంది. గురువారం రిలీజ్ అయిన ఈ మూవీకి వీకెండ్ బాగానే కలిసోచ్చింది. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మూడు రోజులకు గాను ఓవర్ ఆల్ గా రూ. 19 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ మూవీకి రెస్పాన్స్ పెరగడంతో పబ్లిక్ డిమాండ్ మేరకు థియేటర్లను కూడా పెంచారు. మరి నాలుగు రోజులకు కలెక్షన్స్ ఏ మాత్రం పెరిగాయో ఒకసారి తెలుసుకుందాం..


ఎస్ఆర్ కల్యాణ మండపం లాంటి ఎమోషనల్ మూవీతో ప్రేక్షకులకు మనసు దోచుకున్న హీరో కిరణ్ అబ్బవరం ఈసారి ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చాలా కాలంగా బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న కిరణ్ అబ్బవరం నటించిన ఈ మూవీ.. గతంలో చూడని సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కింది. దీంతో ఇది అంచనాలను భారీగా ఏర్పరచుకుని దీపావళి కానుకగా విడుదల అయింది.. సుజిత్, సందీప్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే ‘క’. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల దీనిపై ఆసక్తి పెరిగింది. మొదటి రోజు రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటుకుంది. అదే ఊపును కంటిన్యూ చేస్తూ రెండో రోజు కాసింత ఎక్కువగానే గ్రాస్‌ను రాబట్టింది. ఇక, మూడో రోజు ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. 19 కోట్ల వసూల్ చేసింది. ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో 6 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు రూ. 25 కోట్లకు పైగా వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల జనాలు అంచనా వేస్తున్నారు.

రిలీజ్ కు ముందు సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి.. ఇక రిలీజ్ అయిన ‘క’ సినిమా వాస్తవానికి వేరే సినిమాల నుంచి తీవ్ర పోటీ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 340 థియేటర్ల లోనే విడుదలైంది. కానీ, ఆ తర్వాత పబ్లిక్ డిమాండ్ మేరకు థియేటర్ల సంఖ్య ను 550 కి పెంచారు. అందుకే దీనికి వసూళ్లు పోటెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు.. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ పరంగా ఇది రూ. 10 కోట్లు వరకూ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ. 22 కోట్లు గ్రాస్ వసూలు అయితే ఇది హిట్ స్టేటస్‌ ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన చూస్తే నాలుగు రోజుల్లోనే హిట్ టాక్ ను సొంతం చేసేకుంది.. ఈ వారం మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×