E-Paper
Advertisement

OTT Movie : మలయాళ కామెడీ థ్రిల్లర్… చూశారంటే పడి పడి నవ్వడం ఖాయం

OTT Movie : మలయాళ కామెడీ థ్రిల్లర్… చూశారంటే పడి పడి నవ్వడం ఖాయం
Advertisement

OTT Movie : మలయాళం సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఓటీటీలో మలయాళ కంటెంట్‌కు డిమాండ్ పెరిగింది. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలతో కూడిన మలయాళ సినిమాలు భాష అనే అడ్డును కూడా దాటుకుని అందరికీ నచ్చుతున్నాయి. ఇప్పుడు చాలా మలయాళ సినిమాలు ఇతర భాషల్లో కూడా ఓటీటీలో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత భాషలో మలయాళ సినిమాలను చూసే అవకాశం పొందుతున్నారు. ఇక ఎప్పటిలాగే మలయాళ సినిమాలు అంటూ చెవి కోసుకునే వారి కోసం తాజాగా ఓటీటీలోకి ఓ కొత్త సినిమా వచ్చింది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే?

Advertisement

భరతనాట్యం అనే కొత్త మలయాళ చిత్రం ఈ వారం ఓటీటీలో విడుదల కానుంది. ఆగస్ట్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే బిగ్ స్క్రీన్ పైకి వచ్చి నెలరోజులు కూడా కాకముందే ఈ చిత్రం వచ్చే శుక్రవారం నుండి మనోరమ మ్యాక్స్ అనే ఓటీటీలో ప్రసారం కానుంది. భరతనాట్యం సినిమాలో సైజు కురుపా, సాయి కుమార్, కళారంజిని, అభిరామ్ రాధాకృష్ణన్, శృతి సురేష్, గంగా మీరా, మణికంఠన్, నందు పొడువాల్, సోహన్ శీనులాల్, సలీం హాసన్, కృష్ణదాస్ మురళి, దివ్య ఎం నాయర్, స్వాతిదాస్ ప్రభు, శ్రీజ రవి తదితరులు నటించారు. కృష్ణదాస్ మురళి ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. సైజు కురుప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, థామస్ తిరువల్ల ఫిల్మ్స్ బ్యానర్లపై లిని మరియం డేవిడ్, అనుపమ బి నంబియార్ ఈ చిత్రానికి  నిర్మాతలుగా వ్యవహరించారు. భరతనాట్యం మవవీకి శామ్యూల్ అబీ సంగీతం అందించారు.

Saiju Kurup's 'Bharatanatyam' gets a release date | - Times of India

Advertisement

తెలుగులో స్ట్రీమింగ్ ?

సెప్టెంబర్ 27 న ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్న మలయాళ కామెడీ ఎంటర్టైనర్ భరతనాట్యం కేవలం మనోరమ మాక్స్ లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంటుందా ? అంటే ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఒకవేళ సినిమా తెలుగులో అందుబాటులో లేకపోయినా చూడాలి అనుకుంటే సబ్ టైటిల్స్ తో ఎలాగూ చూడవచ్చు. సహజత్వం ఉట్టిపడే కామెడీతో సాగే ఈ మూవీని చూస్తూ ఫ్యామిలీ మొత్తం కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

స్టోరీ లోకి వెళ్తే.. 
భరతనాట్యం సినిమా టైటిల్ చూసి ఇది ఆ సంప్రదాయ భరతనాట్య నృత్యానికి సంబంధించిన కథ అని అనుకుంటే తప్పే. నిజానికి ఇది కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రానికి ప్రధాన పాత్రధారి భరతన్ నాయర్ (సాయి కుమార్) పేరు పెట్టారు. సినిమా మొత్తం భరతన్, అతని కొడుకు శశి (సైజు కురుప్), భరతన్ రహస్యంగా ఉంచిన రెండవ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అబద్ధాలతో జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తి స్టోరీ ఇది. అయితే సినిమా మొత్తం కామెడీగా ఉండడంతో పాటు అక్కడక్కడా గుండెను పిండేసే ఎమోషన్స్ ఉండే కొత్తదనంతో కూడిన అందమైన కుటుంబం చిత్రం ఇది.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×