BigTV English

OTT Movie : భార్య కడుపుతో ఉందని ప్రియురాలితో ఆ పని… క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : భార్య కడుపుతో ఉందని ప్రియురాలితో ఆ పని… క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : భార్యాభర్తల బంధం ఎంత నమ్మకం ఉంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే నమ్మకమే పునాది అంటూ ఉంటారు పెద్దలు. కానీ కొంతమంది బుద్ధి గడ్డి తిని మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పక్క చూపులు చూస్తూ ఉంటారు. అలా పెడదారి పట్టి కట్టుకున్న పెళ్ళాన్ని పక్కన పెట్టేసి ఇతర అమ్మాయిల మోజులో పడతారు. కానీ తీరా జ్ఞానోదయం అయ్యే సరికి పరిస్థితి చేయి జారిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం అదృష్టం బాగుంది టైంకి కళ్ళు తెరుచుకుంటారు. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చు? అలా పక్కదారి పట్టిన భర్తను భార్య ఎలా దారిలోకి తెచ్చుకుంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


జీ5 లో అందుబాటులో…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మూవీ కాదు ఒక మలయాళం వెబ్ సిరీస్. ఆ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో స్టోరీ ఉంటుంది. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉండగా అందులో అద్భుతంగా ఉన్న స్టోరీలలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 (Zee5)లో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే…

హీరోయిన్ కి ఒక అనారోగ్యంగా ఉన్న కూతురు ఉంటుంది. అలాగే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్. ఇలా తల్లి కాబోతున్న భార్యను వదిలేసి భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్తాడు. కడుపుతో ఉన్నప్పటికీ భార్య ఇంట్లోనే ఉంటూ తమ పొలాలకు సంబంధించిన పనులతో పాటు ఇంటి పనులను కూడా చూసుకుంటుంది. నిజానికి ఆమె భర్త ఆ ఇంట్లో పనోడు. కానీ అతని తండ్రి ఇతని పనితనాన్ని మెచ్చి కూతురుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక అతనికి నా అనే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో ఇల్లరికం అల్లుడు కింద ఇక్కడే ఉంచి, భారీ ఆస్తికి వారసుడిని చేస్తారు. కానీ అతను ఉద్యోగం పేరుతో వేరే ఊళ్లో మరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో కుక్కకు ఉండే విశ్వాసం కూడా అతనికి ఉండదు. భార్య ఎన్నోసార్లు ఇంటికి రమ్మని ఫోన్ చేసినప్పటికీ చాలా బిజీగా ఉన్నాను అనే సాకుతో అక్కడే ఉంటాడు. ప్రియురాలు మోజులో పడి ఇంటికి వచ్చేటప్పుడు అనారోగ్యంతో ఉన్న కూతురుకి మందులు తేవడం కూడా మర్చిపోతాడు. ఇక వచ్చి ఇంట్లో రెండు రోజులు ఉంటాడో లేదో ప్రియురాలు గుర్తొచ్చి లాయర్ ని కలవాలి అనే సాకుతో మళ్లీ ఊరికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆమె చర్చ్ లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇంకేముంది ఆమె చేసిన మోసంతో ఒక్కసారిగా ఇతడికి కళ్ళు తెరుచుకుంటాయి. వెంటనే ఊరికి బయలుదేరుతాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు? ఇతనికి ఎలా బుద్ధి వచ్చింది? హీరోయిన్ అతను వేరే అమ్మాయి మోజులో పడ్డాడు అని తెలిసినప్పుడు ఎందుకు ఏం మాట్లాడదు? చివరికి స్టోరీ ఎలా ఎండ్ అయ్యింది? అనే విషయం తెలియాలంటే ‘మనోరతంగల్’ (Manorathangal) అనే ఈ సిరీస్ లో 7వ ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×