BigTV English

OTT Movie : మర్రి చెట్టు కింద క్షుద్ర పూజలు, ఆడపిల్లలే టార్గెట్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : మర్రి చెట్టు కింద క్షుద్ర పూజలు, ఆడపిల్లలే టార్గెట్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : ఓటిటిలో ఓవైపు వివిధ జానర్ల సినిమాలు సందడి చేస్తుంటే, మరోవైపు వెబ్ సిరీస్ లకు రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో ఓటిటీ మూవీ లవర్స్ కాస్త ఫ్రీ టైం దొరికితే చాలు మంచి వెబ్ సిరీస్ లో ఏమున్నాయి ? అని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలు కూడా గతంలో వచ్చిన పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను సజెస్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. కాకపోతే ఈ సిరీస్ పాతది కాదు, ఇంకా ఓటీటీలోకి కూడా రాలేదు. మరి ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలోకి రానుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


ఒక రాష్ట్రాన్నే వణికించిన కథ ఇది

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ స్ ఒకప్పుడు ఏకంగా ఒక రాష్ట్రాన్నే వణికించింది. గతంలో ఓ ప్రాంతంలో వరుసగా ఏడు హత్యలు జరగగా, ఏడు సంవత్సరాల పాటు ఆ కేసును ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ కేసు ఏళ్లపాటు కొనసాగడంతో పాటు లేనిపోని అనుమానాలు లేవనెత్తేలా చేసింది. మహారాష్ట్రను వణికించిన దారుణమైన ఈ క్రైమ్ ఆధారంగా ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సిరీస్ రూపొందింది. అయితే రీసెంట్ గా ‘మన్వత్ మర్డర్స్’ పేరుతో రూపొందిన ఈ సిరీస్ ను సోనీ లివ్ లో రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 4 నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను సోనీ లీవ్ లో చూడొచ్చు.


స్టోరీ ఏంటంటే…

సినిమా మొదట్లోనే ఒక ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద క్షుద్ర పూజలు జరిగినట్టుగా చూపిస్తారు. అందులోనూ ఆడపిల్లలనే టార్గెట్ చేసి ఎవరికి తెలియకుండా చంపేస్తారు. ఈ నేపథ్యంలోనే నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మహిళలు వరుసగా హత్యకు గురవుతారు. అయితే స్థానిక పోలీసులు ఎంత ఇన్వెస్టిగేట్ చేసిన క్లూ ఏమీ దొరక్క చేతులెత్తేస్తారు. అసలు ఈ హత్యలు ఎవరు ఎందుకు చేస్తున్నారు? అనే విషయం అర్థం కాక తలలు పట్టుకుంటారు. దీంతో ఈ కేసు ఇన్వెస్ట్ గేట్ చేయడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. ఇంతకీ ఇలా అమ్మాయిలని టార్గెట్ చేసి ఎవరు, ఎందుకు చంపుతున్నారు? ఇలా వరుస హత్య చేస్తున్న ఆ సైకోను పోలీసులు కనిపెట్టగలిగారా? ఇన్ని వరస మర్డర్స్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న ఈ మిస్టరీ వెబ్ సిరీస్ ‘మన్వత్ మర్డర్స్’ ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ వీక్ లోనే ‘మన్వత్ మర్డర్స్’ స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి మీరు గనుక సస్పెన్స్ మర్డర్ మిస్టరీ మూవీ లవర్స్ అయితే తప్పకుండా నెక్స్ట్ వీకెండ్ ‘మన్వత్ మర్డర్స్’పై ఒక లుక్ వేయండి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×