BigTV English

OTT Movie : ఆ ఊర్లో అమావాస్య వచ్చిందంటే చావే… వెన్నులో వణుకు పుట్టించే హారర్ మూవీ

OTT Movie : ఆ ఊర్లో అమావాస్య వచ్చిందంటే చావే… వెన్నులో వణుకు పుట్టించే హారర్ మూవీ

OTT Movie : హర్రర్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకునే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. అయితే కొన్ని సినిమాలు హర్రర్ కామెడి ఎంటర్టైనర్ తో తెరకెక్కిస్తారు మేకర్స్. అటువంటి మూవీస్ ఈ మధ్య బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు చూడాలంటే వణుకు పుడుతూ ఉంటుంది. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అటువంటి మూవీ ఒకటి థియేటర్లలో మంచి రెస్పాన్స్ తో రిలీజ్ అయి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్ (youtube)

మనం ఇప్పుడు చెప్పుకుపోయే మూవీ పేరు “మురుధన్” (Murudhan). ఇది ఒక తమిళ్ మూవీ. ఒక ఊరిలో అమావాస్య రోజు మాత్రమే మనుషులు చనిపోతూ ఉండటంతో, ఎందుకు చనిపోతున్నారో  తెలుసుకునే  ప్రయత్నం చేసే హీరో చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ హర్రర్ సస్పెన్స్ మూవీ యూట్యూబ్ (youtube) లో  స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన ఫ్రెండ్స్ తో ఒక ఊరిలో సరదాగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు తన ఫ్రెండ్ ఇంట్లో అంజలి అనే అమ్మాయిని చూస్తాడు. మొదటి చూపులోనే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు హీరో తన ఫ్రెండ్స్ తో కల్లు తాగుతూ ఇంటికి వస్తుండగా, ఒక వ్యక్తి చనిపోతాడు. అది అమావాస్య కావడంతో ఇలా జరిగిందని ఊరి జనం అనుకుంటారు. ఆ ఊరిలో అమావాస్య రోజు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. మరోవైపు ఆ ఊరిలో ఒక ఇంట్లో ఒక ఆత్మ నిద్రపోతున్న అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఒకరోజు హీరో తన ఫ్రెండ్స్ తో కల్లు తాగి వస్తుండగా. హీరో ఫ్రెండ్ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కిందపడి చనిపోతాడు. ఆరోజు కూడా అమావాస్య రోజు కావడంతో ఇలా జరిగిందని అంతా అనుకుంటారు.

అయితే ఒక పోలీస్ ఆఫీసర్ కళ్ళు తీస్తున్న చెట్టుకు కాపలాగా ఉండి అందులో ఏమన్నా కలుపుతున్నారేమో అని అక్కడే రాత్రంతా ఉంటాడు. అయితే ఎవరు ఏమీ కలపకపోవడంతో ఆ కల్లుని పోలీస్ ఆఫీసర్ తాగుతాడు. అది తాగిన మరుక్షణం పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోతాడు. ఆ తరువాత హీరో ఆ రహస్యాన్ని కనుక్కోవటానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో హెరోకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురౌతాయి.  అమావాస్య రోజు ఎందుకు ఆ ఊరిలో మనుషులు చచ్చిపోతున్నారు? ఆ దయ్యానికి హీరోకి ఏమైనా సంబంధం ఉందా? ఆ దయ్యం నుంచి ఆ ఊరిని హీరో కాపాడగలుగుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న మురుధన్ (Murudhan) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ను ఇస్టపడే  మూవీ లవర్స్ కు ఇదొక బెస్ట్ ఆప్షన్. మరెందుకు ఆలస్యం ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.

Related News

3BHK Movie: సచిన్ ఎఫెక్ట్.. హిందీ వెర్షన్ లో ఓటీటీ విడుదలకు సిద్ధమైన 3bhk!

OTT Movie : ప్రియుడు లేడని అంకుల్ తో … ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో అన్నీ అలాంటి సీన్లే … ఇలాంటి సినిమాలు చుస్తే

OTT Movie : ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్స్ దగ్గరికి… నలుగురూ కలిసి బ్లైండ్ ఫోల్డ్ చేసి… ఈ అరాచకం సింగిల్స్ కి మాత్రమే

OTT Movie : అమ్మమ్మ చావుతో అంతులేని వింత సంఘటనలు… ఫ్యామిలీని ఆటాడించే అతీంద్రీయ శక్తి… కల్లోనూ వెంటాడే కథ

OTT Movie : చేపల వేటకు వెళ్లి బద్ద శత్రువు చేతికి బలి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే స్టోరీ… ‘తండేల్’ మాత్రం కాదండోయ్

OTT Movie : బట్టలన్నీ విప్పి వీడియోలు… మిస్టరీ అమ్మాయి ఎంట్రీతో మతిపోగోట్టే ట్విస్ట్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Big Stories

×