BigTV English

OTT Movie : అఘాయిత్యం చేశాడంటూ ప్రొఫెసర్ పై స్టూడెంట్ పోస్ట్…

OTT Movie : అఘాయిత్యం చేశాడంటూ ప్రొఫెసర్ పై స్టూడెంట్ పోస్ట్…

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న మూవీస్ కొద్ది రోజులలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ లు డైరెక్ట్ గానే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతున్నాయి. టీచర్ స్టూడెంట్ ల మధ్య రిలేషన్షిప్ తో చాలా సిరీస్ లు వచ్చాయి. అయితే ఈ వెబ్ సిరీస్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇది ఒక బెంగాలీ మూవీ. ప్రొఫెసర్ ఒక స్టూడెంట్ ను అఘాయిత్యం చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెడుతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏం చేశాడనే దాని చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. ఈ సిరీస్ పేరు “నోష్టోనీర్” (noshtoneer). ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రిషబ్ ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి భార్య అపర్ణ కూతురు మిస్టి ఉంటారు. వీరి కుటుంబం హాయిగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఒక రోజు రిషబ్ స్టూడెంట్ తనని ప్రొఫెసర్ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెడుతుంది. అది వైరల్ అయి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే వరకు వెళ్తుంది. అయితే అపర్ణ ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఆమెకు తన భర్త మీద నమ్మకం ఎక్కువ. ఆ స్టూడెంట్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. హాస్పిటల్లో ఉన్న స్టూడెంట్ ని, అపర్ణ కలుస్తుంది. అతను నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడని, ప్రెగ్నెంట్ అని తెలిసి తనని బ్లాక్ లో పెట్టాడని అందుకే పోస్ట్ పెట్టవలసి వచ్చిందిని చెప్తుంది. అయితే ఆ మరుసటి  రోజే ఆమెకు ఆరోగ్యం బాగోలేక చనిపోతుంది. ఆమె చనిపోవడంతో రిషబ్ ను పోలీసులు వదిలేస్తారు.

అయితే అతను నిర్దోషినంటూ తన భార్యకు చెప్తాడు. భార్యకు మాత్రం కాస్త ఎక్కడో అనుమానం మొదలవుతుంది. ఆమె క్యారెక్టర్ సరికాదని కొంతమంది స్టూడెంట్స్ అపర్ణకు చెప్తారు. అయితే అపర్ణ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చి తను ఎలాంటిదో నాకు తెలుసు అంటూ చెప్పుకొస్తాడు. తనని నేను ప్రేమించాను కానీ ఆమె మరెవరినో ఇష్టపడింది. ఆ విషయం నాతో చెప్పకుండా దాచి పెట్టింది అంటూ అపర్ణకి చెప్తాడు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని చెక్ చేయగా అందులో ఆర్ అనే అక్షరంతో ఆమె ఒక లాకెట్ వేసుకొని ఉంటుంది. అప్పుడు ప్రొఫెసర్ భార్యకు అనుమానం పెరుగుతుంది. ఇంతకీ ఆ స్టూడెంట్ పై అఘాయిత్యం చేసింది ఎవరు? ఆ ప్రొఫెసర్ నిర్దోషి అని నిరూపించుకుంటాడా? ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి.

Related News

SU from SO OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×