OTT Movie : యూత్ ను ఎంటర్టైన్ చేసే సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలను చూస్తే ప్రేమ గుడ్డిదని అన్పిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో లవ్ స్టోరీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ మూవీ పేరు “మై బ్లైండ్ బ్రదర్” (My blind brother). ఈ మూవీలో గుడ్డివాడైన తమ్ముడి లవర్ తో అన్న ప్రేమాయణం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు, ఒక అమ్మాయి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
బిల్, రాబీ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. రాబికి కళ్ళు సరిగ్గా కనబడకపోవడంతో బిల్ తనకి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు మారథాన్ రేసులో తమ్ముడికి బిల్ సహాయం చేస్తాడు. ఆ రేస్ లో రాబి గెలవడంతో తల్లిదండ్రులు అతనిని మెచ్చుకుంటారు. అయితే అతని గెలుపుకు కారణమైన బిల్ ను పట్టించుకోరు. తల్లిదండ్రులు ఎప్పుడూ రాబిన్ ను మెచ్చుకోవడంతో బిల్ బాధపడతాడు. ఒకరోజు బార్ లో మద్యం సేవిస్తుండగా అతని పక్కనే రోసి అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఇద్దరూ మద్యం సేవించి ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. అలాగే ఇద్దరూ ఏకాంతంగా కూడా గడుపుతారు. తాగిన మత్తులో ఇలా జరిగిందని చెప్పి రోసి వెళ్లిపోతుంది. అప్పటినుంచి బిల్ కాస్త ఎక్కువగా బాధపడతాడు. తమ్మునికి కూడా విషయం చెప్పి తను గుర్తుకొస్తుంది అంటూ బాధపడతాడు. ఆ తర్వాత రాబి స్విమ్మింగ్ నేర్పించాల్సిందిగా బిల్ ని అడుగుతాడు. అయితే బిల్ అందుకు నిరాకరిస్తాడు. రాబి స్విమ్మింగ్ నేర్పించడానికి ఒక మనిషిని అపాయింట్ చేసుకుంటాడు. ఆమె ఎవరో కాదు రాబి, అన్నతో మద్యం మత్తులో ఏకాంతంగా గడిపిన రోసి.
ఆమెను చూసి బిల్ షాక్ అవుతాడు. అయితే ఆమె అవేమీ పట్టించుకోదు. రాబి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా ఆ ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఉంటే ఒకరోజు బిల్ ఆమెను నువ్వంటే నాకు ఇష్టం అంటూ అక్కడే ఆమెతో ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తుండగా, ఇంతలో తమ్ముడు అక్కడికి వస్తాడు. అతడు గుడ్డివాడు కావడంతో చూడలేడులే అని అనుకుంటారు. ఒకరోజు స్విమ్మింగ్ పోటీలు ఉండటంతో రాబిని బిల్, రోసి తీసుకువెళ్తారు. అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటే వీళ్ళు డైరెక్షన్ చెప్తూ ఉంటారు. అయితే మాటల్లో పడ్డ వీళ్ళు అతన్ని పట్టించుకోరు. రాబి కోపంతో ‘ఆరోజు ఏం జరిగిందో నాకు తెలుసు, నన్ను మోసం చేయాలనుకున్నారు మీరు’ అని గట్టిగా అరుస్తాడు. నా గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని ఎలా చేయగలిగావంటూ అన్నను నిందిస్తాడు. ఈ క్రమంలో నీళ్లల్లో ఉన్న తమ్మున్ని బిల్ కాపాడతాడా? రోసి చివరికి ఎవరిని లవ్ చేస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “మై బ్లైండ్ బ్రదర్” మూవీని తప్పకుండా చూడండి.