OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలను చూస్తూ మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ తో థ్రిల్ అవుతూ ఎంటర్టైన్ అవుతుంటారు. కొన్ని సినిమాలు అంతగా భయం పుట్టించవు. మరికొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “డిలీటర్” (Deleter) ఈ మూవీలో ఒక అమ్మాయి తన కోలీగ్స్ కారణంగా చనిపోవడంతో, ఘోస్ట్ గా మారి, తనని వేధించిన వాళ్ళమీద పగ తీర్చుకోవటంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
లేరా అనే అమ్మాయి ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. ఆమెతోపాటు మరి కొంతమంది అదే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వీళ్లు కంప్యూటర్లో కొన్ని అభ్యంతరకరమైన వీడియోలను చూసి డిలీట్ చేస్తుంటారు. లేరాకి హైలీన్ అనే ఒక అమ్మాయి ఫ్రెండ్ గా ఉంటుంది. ఒకరోజు హైలైన్ అకస్మాత్తుగా ఆ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతుంది. పోలీసులు అక్కడ ఎంక్వయిరీ చేయడంతో ఆమె గురించి మాకు తెలియదని అందరూ చెప్తారు. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి ఘోస్ట్ గా మరి అక్కడున్న వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా లైరాను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. హైలిన్ చనిపోవడానికి ముందు ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియో లేరా కంప్యూటర్ లో ప్లే అవుతుంది. ఆ వీడియోని అక్కడే ఉన్న సైమన్ అనే వ్యక్తికి చూపిస్తుంది. ఆ వీడియోని డిలీట్ చేయమని లేరాకు చెప్తాడు సైమన్. డిలీట్ చేసినా అది మళ్లీ ప్లే అవుతూ ఉంటుంది.
సెక్యూరిటీ సిస్టంలో వీడియో డిలీట్ చేయమని సెక్యూరిటీకి చెప్తాడు సైమన్. అప్పుడు సెక్యూరిటీ ఆ వీడియోని డిలీట్ చేస్తుండగా ఆ గఘోస్ట్ అతనిని చంపేస్తుంది. మరోవైపు హైలిన్ చనిపోవడానికి ముందు ఆమెకు మత్తు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తాడు సైమన్. సైమన్ చేసిన అఘాయిత్యాన్ని చూసిన లేరా సైలెంట్ గా వుండిపోతుంది. ఈ క్రమంలోనే హైలిన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? లేరాను ఘోస్ట్ ఏం చేస్తుంది? సైమన్ ఆ ఘోస్ట్ నుంచి తప్పించుకుంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ ‘డిలీటర్’ (Deleter) మూవీని తప్పకుండా చూడండి. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని ఒంటరిగా చూడటం కష్టమే. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఈ మూవీలో చాలానే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పై ఓ లుక్ వేయండి.