Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మను కలవడానికి రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది ఆరు. ఇంట్లో మంగళ ఉండటం చూసి షాక్ అవుతుంది. మిస్సమ్మ ఎక్కడ ఉందబ్బా అనుకుంటూ వెతుకుతుంటే వెనక నుంచి వచ్చిన మిస్సమ్మ ఆరును అక్కా నువ్వెప్పుడు వచ్చావు అని పలకరిస్తుంది. అక్కడే వంట చేస్తున్న మంగళ షాకింగ్ గా అక్కానా..? పిన్ని అక్కను చేశావా..? అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దీంతో మిమ్మల్ని కాదు పిన్ని పక్కింటి అక్క ఇదిగో ఇక్కడ ఉంది కదా..? అని చెప్పగానే మంగళ భయంతో వణికిపోతూ కొంపదీసి ఆ ఆత్మ కానీ ఇక్కడకు వచ్చిందా..? ఏంటి అను మనసులో అనుకుంటుంది.
ఇంతలో మిస్సమ్మ ఏంటి పిన్ని అక్కను కనీసం లోపలికి కూడ పిలవడం లేదు. రా అక్క ఇక్కడ కూర్చో అని లోపలికి తీసుకొస్తుంది. మంగళ ఆరు ఆత్మ వచ్చిందని కన్ఫం చేసుకుంటుంది. ఆరును లోపల కూర్చోబెట్టిన మిస్సమ్మ పిన్ని అక్కకు మంచి నీళ్లు ఇవ్వు అంటుంది. దీంతో మంగళ మరింత షాక్ అవుతూ వెళ్లి తనే నీళ్లు తాగుతుంది. ఏంటి పిన్ని అక్కకు ఇవ్వు అంటే నువ్వు తాగుతున్నావు అంటుంది మిస్సమ్మ. అక్కా మా పిన్ని అలా ఉంటుంది కానీ చాలా మంచిది అని పిన్ని వచ్చి అక్కను పలకరించు అని చెప్తుంది. అసలు ఎక్కడ ఉందో తెలియనిదాన్ని ఎలా పలకరించాలి. ఇప్పుడు నాకు ఎవ్వరూ కనిపించడం లేదని చెప్తే ఈ భాగీకి నిజం తెలుస్తుంది. నిజం తెలిస్తే ఆ మనోహరి నన్ను బతకనివ్వదు అని మనసులో అనుకుంటూ.. దగ్గరకు వచ్చి ఏమ్మా మంచి గున్నావా..? అని కనబడ్డట్టు పలకరిస్తుంది.
మంగళ మాటలకు ఆరు షాక్ అవుతుంది. నేను నేను కనపించికపోయినా ఎందుకు కనిపించినట్టు చేస్తుంది. ఈవిడ కూడా మనోహరి పార్టీ కదా..? నిజం బయట పడకుండా కనిపిస్తున్నట్టు యాక్ట్ చేస్తుందన్నమాట అని మనసులో అనుకుని నేను బాగున్నాను ఆంటీ. మీరెలా ఉన్నారు అని ఆరు పలకరిస్తుంది. దీంతో మంగళ పిచ్చి చూపులు చూస్తుంటే.. ఏంటి పిన్ని నువ్వు బాగున్నావా..? అని అక్క అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదు అని మిస్సమ్మ చెప్పగానే ఆత్మ మాట్లాడింది నాకెలా వినిపిస్తుందే.. అయ్యో మంగళ ఎటువంటి పంచాయతిలో ఇరుక్కున్నావే..అని మనసులో అనుకుని మంచిగానే ఉన్నాను బేటా..అని రిప్లై ఇస్తుంది.
ఇంతలో మిస్సమ్మ పిన్ని అక్కకు మంచి కాఫీ తీసుకురా అని చెప్తుంది. భయంతో లోపలికి వెళ్లిన మంగళ, మనోహరికి కాల్ చేస్తుంది. ఆరు ఆత్మ వచ్చిందని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో తేరుకుని నువ్వు కనిపిస్తున్నట్టుగానే యాక్ట్ చేయ్ అని చెప్తుంది. అలాగే చేస్తున్నాను కానీ ఇప్పుడు కాఫీ ఇవ్వమని చెప్పింది. ఆత్మకు కాఫీ ఎలా ఇవ్వాలి అని అడుగుతుంది. ఎలాగైనా ఇవ్వు ఆరుయే తప్పించుకుంటుంది అని మనోహరి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
మిస్సమ్మను తీసుకురావడానికి వెళ్తున్న అమర్ పిల్లలను కూడా రెడీ అయి రమ్మనడంతో ముగ్గురు మాత్రమే వస్తారు. దీంతో అమర్ అంజు ఎక్కడ అని అడుగుతాడు. రెడీ అవుతుందని పిల్లలు చెప్తారు. రెడీ అవుతుందా..? రానని చెప్పిందా..? అమ్ము అని రాథోడ్ అడుగుతాడు. దీంతో అమర్ రానని చెప్పడం ఏంటి? అని అడుగుతాడు. అంటే సార్ అది అంజలి పాపకు మిస్సమ్మను మళ్లీ ఇంటికి తీసుకురావడం ఇష్టం లేదు సార్ అని రాథోడ్ చెప్తాడు. దీంతో అమర్ ఇష్టం లేదా..? ఎందుకు ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా..? అని అడుగుతాడు.
దీంతో కంగారుగా అమ్ము అలాంటిదేమీ లేదు డాడీ. ముందు నుంచి అంజలికి మిస్సమ్మ అంటే ఇష్టం లేదు కదా..? అందుకే అని సర్ది చెప్పబోతుంటే పైనుంచి గమనిస్తున్న మనోహరి అది రాదని నాకు తెలుసు. అది రాకుండా నువ్వు వెళ్లవని నాకు తెలుసు అమర్. అయినా అదేంటో పుట్టింది దానికైనా అన్ని నా పోలికలే.. అసలు నా కూతురుగా పుట్టాల్సింది. నిప్పు నేను పెట్టాను మంట ఆ బుడ్డది పెడుతుంది అనుకుంటూ హ్యపీగా ఫీలవుతుంది. ఇంతలో రాథోడ్ లోపలకి వెళ్లి అంజును తీసుకొస్తాడు. అంజును అమర్ కన్వీ్న్స్ చేయడంతో మిస్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అందరూ కలిపి వెళ్లిపోతారు. మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది.
ఇంట్లో కూర్చున్న మిస్సమ్మ, ఆరుతో మాట్లాడుతుంది. మంగళ మాత్రం భయంతో ఒక మూలగా నిలబడి చూస్తుంటుంది. ఇంతలో శివరాం, నిర్మల, మిస్సమ్మకు ఫోన్ చేసి నీకోసం అమర్, పిల్లలు వచ్చారని అడిగిన వెంటనే రాకుండా కొంచెం బెట్టు చేయమని చెప్తారు. అమర్, పిల్లలను చూడగానే నేను యాక్టింగ్ చేయలేనని మిస్సమ్మ చెప్తూ పక్కింటి అక్క ఉంది మాట్లాడతారా…? అని అడుగుతుంది. పక్కింటి అక్క అక్కడ ఎందుకుంది అని నిర్మల అడగ్గానే నన్ను చూడటానికి వచ్చారట అని ఫోన్ ఆరుకు ఇస్తుంది. ఆరు హలో అంటుంది.
అటువైపు నిర్మల, శివరాం హలో అంటూ వాయిస్ వినిపించడం లేదేంటి అంటూ ఉంటే ఆరు కూడా వాయిస్ వినిపించడం లేదు మిస్సమ్మ సిగ్నల్ పోయినట్టు ఉంది అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో రామ్మూర్తి ఇంటికి రావడం గమనించిన మంగళ.. ఆరుకు వినిపించేలా.. మా ఆయనకు ఈ మధ్యనే గుండె ఆఫరేషన్ అయిందని.. ఇప్పుడు షాకింగ్ విషయాలు చూస్తే మరోసారి గుండె ఆగిపోతుందని చెప్పడంతో ఆరు అర్థం చేసుకుని మిస్సమ్మ నాకు అర్జెంట్ పని ఉంది వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
గార్డెన్ లో కూర్చున్న గుప్త, యముణ్ని మీరు ఏదో కారణం ఉంటేనే తప్పా భూలోకంలోకి రారని అడుగుతాడు. మళ్లీ ఆ బాలికకు ఏదైనా ప్రమాదం రాబోతుందా..? ప్రభూ అని అడుగుతాడు. యముడు మాత్రం పలకకుండా అలాగే ఉండిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.