OTT Movie : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎంగేజింగా ఉంటాయి. ఈ మూవీస్ చూస్తున్నంత సేపు మూవీ లవర్స్ కుర్చీలకు అతుక్కుపోతారు. ఈ సినిమాలు మొదటి నుంచి చివరిదాకా సస్పెన్స్, ట్విస్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తాయి. ఒక సైకో కిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
ఆహా (aha)
ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీ పేరు “ఆపరేషన్ రావణ్” (Operation RAAVAN). ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను మాత్రమే చంపుతూ సవాల్ విసురుతూ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఒక న్యూస్ టీవీ ఛానల్ లో ఆమని అనే అమ్మాయి పనిచేస్తూ, మినిస్టర్ కు వ్యతిరేకంగా ఆధారాలు సంపాదిస్తుంది. వాటిని ప్రసారం చేయాలని ఆ ఛానల్ ఎడిటర్ ని కోరుతుంది. అయితే ఆ మినిస్టర్ కి భయపడి వాళ్ళు ఆ న్యూస్ ను టెలికాస్ట్ చేయరు. ఈ విషయంలో ఆమె బాధపడుతూ ఉంటుంది. అదే న్యూస్ ఛానల్ కి శ్రీరామ్ అని వ్యక్తి రిపోర్టర్ గా జాయిన్ అవుతాడు. అతనిని ఆమనికి అసిస్టెంట్ గా జాయిన్ చేస్తూ, సిటీలో జరుగుతున్న హత్యల గురించి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తారు. సిటీలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను మాత్రమే చంపుతూఉంటాడు. వాళ్ళ చేతులను కూడా నరికి, డెడ్ బాడీ దగ్గర ఒక చెస్ కాయిన్ పెడుతూ ఉంటాడు. ఎలాగైనా కనిపెట్టాలని శ్రీరామ్, ఆమని డిసైడ్ అవుతారు. శ్రీరామ్ ఎప్పటినుంచో ఆమనిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె ప్రేమను పొందడం కోసమే న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా జాయిన్ అవుతాడు. పై అధికారుల ఒత్తిడితో పోలీసులు నకిలీ సైకో కిల్లర్ ని అరెస్ట్ చేస్తారు. అయితే ఆ వ్యక్తి అసలు సైకో కిల్లర్ కాదని శ్రీరామ్ గ్రహిస్తాడు.
ఇదిలా జరుగుతుంటే చేసిన స్కాం బయటపడుతుందేమోనని ఆమనిని చంపడానికి ప్రయత్నిస్తాడు మినిస్టర్. విషయం తెలిసిన శ్రీరామ్ ఆమని జోలికి రావద్దని మినిస్టర్ కు గట్టగా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్న వాళ్ల కుటుంబాలను విచారిస్తారు. ఈ క్రమంలో వీళ్ళు దిమ్మ తిరిగే విషయాలను వెలుగులోకి తెస్తారు. చివరికి ఈ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ ను వీళ్లు పట్టుకుంటారా? మినిస్టర్ కు ఈ హత్యలతో సంబంధం ఉంటుందా? శ్రీరామ్ ప్రేమను ఆమని యాక్సెప్ట్ చేస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “ఆపరేషన్ రావణ్” (Operation RAAVAN) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో ట్విస్ట్ లు మామూలుగా ఉండవు. మూవీ లవర్స్ ఈ మూవీని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు.