BigTV English
Advertisement

OTT Movie : కడుపుతో ఉన్న కూతురిపై కక్ష… దిమాక్ కరాబ్ చేసే సాయి పల్లవి క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కడుపుతో ఉన్న కూతురిపై కక్ష… దిమాక్ కరాబ్ చేసే సాయి పల్లవి క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలను చూస్తే గుండె బరువు ఎక్కడమే కాదు కోపంతో రక్తం సలసలా మరిగిపోతుంది. ఆ క్రైమ్ చేసే వారిని అక్కడే చంపి పాతరేయాలి అన్నంత కోపం వస్తుంది. అంతటి ఎక్సైటింగ్ ఫీలింగ్ ఇచ్చే క్రైం థ్రిల్లర్ మూవీనే  ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ. పైగా ఇది ఒక ఆంథాలజి సిరీస్. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ పేరు ‘పావ కథైగల్’. ఇందులో సాయి పల్లవి, అంజలి, సిమ్రాన్, కల్కి, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. సిరీస్ మొత్తం నాలుగు ఎపిసోడ్లతో సాగగా, అందులో నాలుగు డిఫరెన్స్ స్టోరీలు ఉంటాయి. కానీ అన్ని పరువుకు సంబంధించిన స్టోరీలే కావడం గమనర్హం. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


ముందుగా టైటిల్ లో ప్రస్తావించిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ సిరీస్లో నాల్గవ స్టోరీ. విషయంలోకి వెళ్తే.. ఈ స్టోరీ పేరు ఆ రాత్రి. సుమతి అనే అమ్మాయి తండ్రికి చెప్పకుండానే లవ్ మ్యారేజ్ చేసుకొని భర్తతో సపరేట్ గా కాపురం ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్ అయిన ఈ అమ్మాయి డెలివరీ టైం దగ్గర పడుతున్న టైంలో తండ్రి ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. ఇంకేముంది మొత్తానికి తండ్రికి కోపం తగ్గింది, వారసుడు పుట్టే టైంకి వచ్చాడు అని తెగ సంతోషపడుతుంది. అంతా హ్యాపీ అనుకునే లోపే పరువు కోసం కడుపుతో ఉన్న కన్న కూతురిని చంపడానికి కూడా వెనకాడడు ఆ కసాయి తండ్రి. మరి చివరికి అతను కూతుర్ని చంపేశాడా? అనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.

మొదటి స్టోరీలోకి వెళ్తే ‘నా బంగారం’ టైటిల్. ఓ పల్లెటూరి అబ్బాయి తనకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తాడు. అంతేకాకుండా తనకు అమ్మాయిల మారడం ఇష్టం ఉండడంతో ఆపరేషన్ చేయించుకుని, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అని ఆశపడతాడు. ఆపరేషన్ తర్వాత ఊరికి తిరిగి వచ్చిన అతను ఊర్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనుకున్నట్టుగా ప్రేమ పెళ్లి చేసుకున్నాడా అనేది ‘నా బంగారం’ స్టోరీ.

సెకండ్ స్టొరీలో ఇద్దరు ట్విన్స్ ఉంటారు. కానీ తండ్రికి భయపడి ప్రేమ విషయాన్ని దాచిపెడతారు. ట్విన్స్ లో ఆదిలక్ష్మి అనే అమ్మాయి కాస్త ధైర్యం చేసి తన ప్రేమ గురించి తనకి చెప్పేస్తుంది. కానీ ఆ తండ్రి కులం పేరుతో ఆమెను చంపి పారేస్తాడు. దీంతో తన లవ్ గురించి ఇంట్లో చెప్పకుండా ఒక లెస్బియన్ అంటూ డ్రామాలు ఆడిన మరో అమ్మాయిని తండ్రి ఏం చేశాడు అనేది ‘వాళ్లను ప్రేమించుకోనీ’ అనే స్టోరీలో చూడాల్సిందే.

మూడో స్టోరీ లో సత్యం, ఆది అనే దంపతులు ఉంటారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ హ్యాపీ ఫ్యామిలీలోని చిన్న పాపపై అత్యాచారం జరగడంతో ఆ కుటుంబం పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది. మరి చివరికి స్టొరీ ఎలాంటి మలుపు తిరిగిందో తెలియాలంటే ‘దివి కుమార్తె’ అనే ఈ మూడో ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×