BigTV English

CM Chandrababu meet PM Modi: ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు గంటపాటు భేటీ, చివరలో లడ్డూ వ్యవహారం కూడా?

CM Chandrababu meet PM Modi: ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు గంటపాటు భేటీ, చివరలో లడ్డూ వ్యవహారం కూడా?

CM Chandrababu meet PM Modi: ప్రధాని నరేంద్రమోడీతో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక అసలేం జరిగింది? ఏపీకి చెందిన ఏయే అంశాలపై మోదీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ వచ్చింది? డిసెంబర్‌లో విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపనకు వస్తున్నారా? గంటన్నరపాటు జరిగిన చర్చల్లో కేంద్రం నుంచి సానుకూల పవనాలు వచ్చాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చివరిలో తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఢిల్లీ టూర్‌లో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో దాదాపు గంటం పాపు సేపు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి వివరించారు. బెజవాడ వ‌ర‌ద‌ సాయం, విశాఖ రైల్వేజోన్‌, అమ‌రావ‌తి, పోల‌వ‌రం నిధులపై సుదీర్ఘంగా చ‌ర్చ‌ జరిగింది.

వరద సాయంతో దెబ్బతిన్న రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అభ్యర్థించినట్టు తెలుస్తోంది. 2047 విజన్‌కు అనుగుణంగా ఏపీ తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రణాళికలను వివరించారు. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరేందుకు చేపట్టిన తీసుకున్న వివరాలను వెల్లడించారు. అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి సాయం కావాలని కోరారు.


ముఖ్యంగా జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వసతుల కల్పన వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. వేగంగా నిధులు విడుదల చేస్తే పనులు వేగంగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. హౌరా-చెన్నై మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్పు, 73 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ఆమోదం లభించినట్టు తెలుస్తోంది.

ALSO READ: ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు గంటపాటు భేటీ, చివరలో లడ్డూ వ్యవహారం కూడా?

వేగంగా నిధులు విడుదల చేస్తే పనులు వేగంగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. హౌరా-చెన్నై మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్పు, 73 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. చెన్నై-బెంగుళూరు-అమరావతిలను కనెక్ట్ చేస్తూ హైస్పీడ్ రైల్వే కారిడార్‌కు దాదాపుగా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రస్తావించిన అంశాలను రానున్న బడ్జెట్‌లో పొందుపరచనున్నట్లు అంతర్గత సమాచారం.

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ చివరలో తిరుమల లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు  రెండు నిమిషాలపాటు చర్చించారట. అసలు ఏం జరిగింది? కల్తీ వెనుక అసలేం జరిగిందనే విషయాలను ఆయన వివరించినట్టు ఢిల్లీ పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. రేపోమాపో ప్రత్యేక దర్యాప్తు టీమ్‌కు అధికారులకు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×