BigTV English

OTT Movie : ఈ అడవిలోకి వెళ్తే దెయ్యాలుగా మారతారు… చలి కాలంలో కూడా చెమటలు పట్టించే హార్రర్ మూవీ

OTT Movie : ఈ అడవిలోకి వెళ్తే దెయ్యాలుగా మారతారు… చలి కాలంలో కూడా చెమటలు పట్టించే హార్రర్ మూవీ

OTT Movie : హర్రర్ సినిమాలు చూడటానికి మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తారు. అయితే వాటిలో కొన్ని సినిమాలు చూడాలంటే భయపడతారు. వాటిని ఒంటరిగా చూడాలంటే ఇక అంతే సంగతులు, గుండె ఆగిపోయినట్టు అవుతుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ సినిమాలలో, ఇండోనేషియన్ హారర్ సినిమాలకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సినిమాలలో హర్రర్ బీభత్సం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అటువంటి హర్రర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియా హర్రర్ మూవీ పేరు ‘ప్రిమ్బన్‘ (primbon). ఈ మూవీలో ఒక అమ్మాయి అడవిలో తప్పిపోయి ఏడు రోజుల తర్వాత ఇంటికి వస్తుంది. ఆమె మనిషా, దయ్యమా తెలుసుకునే క్రమంలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రానా అనే అమ్మాయి తన ఫ్రెండ్ తో కలిసి అడవిలోకి వెళుతుంది. అయితే ఫ్రెండ్ వస్తాడు కానీ ఆమె మాత్రం తప్పిపోతుంది. ఏడు రోజులైనాక ఆ అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే ఆమె దెయ్యమా, మనిషా అని అందరూ అనుమానిస్తారు. ఎందుకంటే ప్రిమ్బన్ అనే గ్రంధాన్ని అక్కడ ఉన్నవాళ్ళు ఫాలో అవుతారు. అది వారికి దైవ గ్రంథంలలా ఉంటుంది. అందులో శపించబడిన అడవుల్లోకి వెళ్లిన వాళ్ళు దయ్యాలుగా మారతారని రాసి ఉంటుంది. రానాకి ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె తన అక్కలో దయ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.  ఇంట్లోకి వచ్చిన రానాని చెక్ చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఒకసారి రానాని చెక్ చేయడానికి డాక్టర్ ని కూడా వీరి కుటుంభ సభ్యులు పిలిపిస్తారు. ఆమెను చెక్ చేసిన డాక్టర్ భయంతో వనికిపోతూ పారిపోతాడు. కుటుంబ సభ్యులను ఆమె వింత ఆకారాలతో భయపెడుతూ ఉంటుంది. రానా అసలు శపించబడిన అడవుల్లోకి ఎందుకు వెళ్లిందంటే…

తల్లి పుట్టిన రోజు మంచిది కాదని అందరూ అంటూ ఉంటారు. ఆమె పుట్టిన రోజు మంచి రోజు అని నిరూపించడానికి, అదే రోజు అడవిలోకి వెళ్లి ఉంటుంది. ఆ విషయం ఆమె సెల్ఫీ తీసుకుంటూ చెప్పి ఉంటుంది. చివరికి ఆమె అడవిలోనే కనపడకుండా పోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళని భయపెడుతూ నరకం చూపిస్తుంది. ఇంట్లో ఉన్న రానా నిజంగానే దయ్యమా? రానా చనిపోయి ఉంటుందా? కుటుంబ సభ్యులు దయ్యం ఆవహించి ఉన్న రానాని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఈ సన్నివేశాలు చూడాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో  స్ట్రీమింగ్ అవుతున్న ‘ప్రిమ్బన్’ (primbon) అనే  హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : అమ్మాయిల్ని ఆ పని కోసమే పుట్టించే ఆణిముత్యం… లాభం లేదు ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : చంపి, శవాలపై U గుర్తు చెక్కే సీరియల్ కిల్లర్… ఒక్కో కేసులో ఒక్కో ట్విస్ట్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : మనిషి లోపల మకాం పెట్టే చిట్టి ఏలియన్స్… భూమిని తుడిచి పెట్టే ప్లాన్ తో రంగంలోకి.

OTT Movie: రేప్ కేసులో సీఎం, ప్రభుత్వాన్ని ఇరికించే లాయర్.. తప్పు బాధితురాలిదా? విడుదలైన గంటలోనే ఓటీటీలో సంచలనం

OTT Movie : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×