BigTV English

OTT Movie : డబ్బు కొట్టేసి పారిపోయిన అమ్మాయి హత్య… సీను సీనుకో ట్విస్ట్ ఉండే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డబ్బు కొట్టేసి పారిపోయిన అమ్మాయి హత్య… సీను సీనుకో ట్విస్ట్ ఉండే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీలు ఇప్పుడు చాలానే వచ్చాయి. కానీ 1960 లోనే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీకి గాడ్ ఆఫ్ సినిమాగా చెప్పుకునే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ‘హిచ్ కాక్’ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amaon prime video)

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు “సైకో” (Psycho). రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి కొంత డబ్బుతో పారిపోతూ ఒక సైకో చేతిలోకి చిక్కుతుంది. ఆ తర్వాత స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పట్లోనే ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amaon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరోయిన్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీకి ఒక ధనవంతుడు వచ్చి కొంత స్థలం కొంటాను అని చెప్పి ఆ కంపెనీకి కొంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుతో హీరోయిన్ ఎవరికీ చెప్పకుండా పారిపోతుంది. హీరోయిన్ కారులో వెళ్తూ ఉండగా పోలీసులు పట్టుకుంటారేమో అని భయపడి ఆమె కార్ ను ఒక షో రూమ్ లో కొంత డబ్బు ఇచ్చి ఎక్సేంజ్ చేస్తుంది. ఇంతలో కంపెనీ ఓనర్ ఈమె మీద కంప్లైంట్ ఇస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ను వెంబడిస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలాగో తప్పించుకొని ఒక హోటల్లో హీరోయిన్ స్టే చేస్తుంది. అక్కడ ఆ హోటల్ ఓనర్ ఆమెకు కావాల్సిన సపర్యలు చేస్తాడు. అయితే అనుకోకుండా ఆ రోజు రాత్రి ఆమెను ఎవరో పొడిచి చంపుతారు. ఆమె శవాన్ని ఆ హోటల్ ఓనర్ కారులో తీసుకెళ్లి  డబ్బు తో సహా ఒక వాగులోకి తోసేస్తాడు.

అయితే రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆమెకు ఒక చెల్లి ఉంటుంది. ఆమె తన అక్క గురించి వెతకడానికి ట్రై చేస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ ను వెతకడానికి హెల్ప్ చేస్తాడు. వీరిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఆ తరువాత హీరోయిన్ ను వెతకడం ప్రారంభిస్తాడు. చివరికి వీళ్లకు ఆమెను వెతికే క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇంతకీ ఆమెను చంపిన ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు ఈ కేసును చేదిస్తారా? ఆమె హత్య కేసులో దాక్కొని ఉన్న రహస్యాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amaon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “సైకో” (Psycho) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడండి.

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×