BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మతో బయటకు వెళ్తున్న అమర్‌ – బాబ్జీ గురించి తెలుసుకున్న రణవీర్‌

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మతో బయటకు వెళ్తున్న అమర్‌ – బాబ్జీ గురించి తెలుసుకున్న రణవీర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode: అరవింద్‌ ను తానే ఎలాగైనా పట్టుకుంటానని అమర్‌ చెప్తాడు. ఎలా పట్టుకుంటావని మేజర్‌ అడగగానే నేను నా ఫ్యామిలీతో ఏ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తాను. అప్పుడు ఆ అరవింద్‌ గాడు. నన్ను టార్గెట్‌ చేయడానికి వస్తాడు. అప్పుడు వాణ్ని పట్టకుంటానని చెప్తాడు అమర్‌. అయితే ఇది చాలా డేంజర్‌ అని నువ్వు రిస్కు తీసుకోవడమే కాకుండా నీ ఫ్యామిలీని కూడా రిస్కులో పడేస్తున్నావని మేజర్‌ చెప్తాడు. నేను ఒక ఇండియన్‌ ఆర్మీ సార్‌ ఇలాంటి వాటికి భయపడితే ఎలా..? నేను కచ్చితంగా ఆ అరవింద్‌ గాడిని పట్టుకుంటాను అని అమర్‌ చెప్పటానే మేజర్‌ సరే అని వెళ్లిపోతాడు.


లాయరు కంగారుగా పరుగెత్తుకొచ్చి.. రెడీ అవుతున్న  రణవీర్‌ కు నీకో విషయం చెప్పాలి అంటాడు. ఏంటా విషయం దుర్గ గురించేనా అంటాడు రణవీర్‌. లేదు మనోహరి గురించి..అదే మనోహరి మనిషి బాబ్జి ఉన్నాడు కదా? వాడిప్పుడు కలకత్తాలో ఉన్నాడు. వాడు అక్కడి ఎందుకు వెళ్లినట్టు.. మనోహరే వాణ్ని అక్కడకు పంపించి ఉంటుంది. అంటాడు. అవునా కలకత్తాలో వాడేం చేస్తున్నాడు అంటూ ఆత్రుతగా అడుగుతాడు రణవీర్‌.

వాడు కలకత్తాలో మథర్‌ థెరిస్సా ఆశ్రమానికి వెళ్లాడట అని లాయరు చెప్తూ.. వాడు అక్కడ ఏమైనా దుర్గ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లాడంటావా? అని అడుగుతాడు. దీంతో రణవీర్‌.. మనోహరి చెడ్డదే కానీ కడుపున పుట్టిన బిడ్డను ఆశ్రమంలో వదిలేసేంత చెడ్డది కాదంటాడు. దుర్గను ఎక్కడో దూరంగా పెట్టి మనోహరి చదివిస్తున్నట్టు ఉంది. దుర్గ గురించి ఒక్క మనోహరికి మాత్రమే తెలిసి ఉంటుంది అంటాడు.


ఇంటికి వచ్చిన అమర్‌, మిస్సమ్మను పిలుస్తాడు. పై నుంచి వచ్చిన మిస్సమ్మ ఏంటండి అరుస్తున్నారు అంటుంది. దీంతో నేను అరవడం లేదు నిన్ను పిలిచాను అని చెప్తాడు అమర్‌. కిటికీలోంచి గమనిస్తున్న ఆరు ఈయనేంటి ఇవాళ వచ్చీ రాగానే మిస్సమ్మను పిలుస్తున్నాడు అనుకుంటుంది.  మిస్సమ్మ మనం ఇద్దరం ఇవాళ బయటకు వెళదాం రెడీ అవ్వు అంటాడు. మిస్సమ్మ అలాగే చూస్తుండి పోతుంది.

దీంతో అమర్‌ కోపంగా ఏయ్‌ లూజు చెప్తుంటే వెళ్లవు ఏంటి అంటాడు. మనోహరి కూడా షాక్ అవుతుంది. అమరేంటి ఇవాళ కొత్తగా దాన్ని బయటకు తీసుకెళ్తా అంటున్నాడు అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ ఇదంతా కలలా ఉంది. అయినా మా ఆయనేంటి? నన్ను బయటకు తీసుకెళ్లడం ఏంటి ఇది కలే అనుకుంటుంది. ఇంతలో నిర్మల అక్కడకు వచ్చి మిస్సమ్మ ఇది కల కాదు నిజం అంటుంది. అమర్‌ కూడా కల కాదు మిస్సమ్మ నిజమే అని చెప్తాడు. అయినా మిస్సమ్మ అసలు నమ్మదు. దీంతో అమర్‌ కోపంగా మిస్సమ్మ చెయ్యి గిల్లుతాడు. ఆ నొప్పికి కెవ్వుమన్న మిస్సమ్మ అవును ఇది నిజమే అంటూ పది నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని పైకి వెళ్లిపోతుంది.

అమర్‌, మిస్సమ్మను బయటకు తీసుకెళ్లడం ఏంటిన మనోహరి ఆలోచిస్తుంది. ఆరు కూడా సేమ్‌ మనోహరి లాగే ఆలోచిస్తుంది. ఇద్దరూ ఒకేలా అమర్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు.  అమర్‌ మాటలకు తల పట్టుకుంటారు. రెడీ కావడానికి పైకి వెళ్లిన మిస్సమ్మ హుషారుగా పాటలు పాడుతూ డాన్స్‌ చేస్తుంది. రాథోడ్‌, మిస్సమ్మ దగ్గరకు వచ్చి అమర్‌ ఎందుకు బయటకు తీసుకెళ్తున్నారో చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ మిస్సమ్మ రాథోడ్‌ మాటలు అసలు వినదు. దీంతో రాథోడ్‌ వెళ్లిపోతాడు.

అమర్‌ను ఎలాగైనా చంపాలని అరవింద్‌ ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఒక అనుచరుడు అరవింద్‌ కు ఫోన్ చేస్తాడు. అన్నా నువ్వు చెప్పినట్టు సింగ్‌ సాబ్‌ ను కలిశాను. అంటాడు. అవునా అయితే అమరేంద్ర గురించి తెలిసిందా?  ఎప్పుడు ఎక్కడ ఉంటాడు. ఎప్పుడు సెక్యూరిటీ ఉండదు. మొత్తం డీటెయిల్స్‌ తెలిశాయా? అని అడుగుతాడు.

దీంతో అనుచరుడు అన్నా అన్నీ డీటెయిల్స్‌ అవసరం లేదు. ఒక ముఖ్యమైన విషయం. అమరేంద్ర ఏ సెక్యూరిటీ లేకుండా తన వైఫ్‌ తో కలిసి బయటకు వెళ్తున్నాడట అని చెప్పగానే అరవింద్‌ గట్టిగా నవ్వి నువ్వు చెప్పేది నిజమా? నీకు వచ్చిన ఇన్మఫర్మేషన్‌ కరేక్టేనా? అని అడుగుతాడు. దీంతో పక్కా అన్నా అంటాడు. దీంతో అరవింద్‌ తనకు ఒక బైక్‌ కావాలని సిటీ మొత్తం తెలిసిన ఒక వ్యక్తి కావాలని అడుగుతాడు. అలాగే అన్నా నువ్వు అడిగినవన్నీ ఇస్తాను కానీ ఆ అమరేంద్రను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అంటాడు అనుచరుడు. అవును నువ్వు చెప్పింది నిజమే అమరేంద్రను ఎదుర్కోవడం సాధ్యం కాదు కానీ వాడి పెళ్లాన్ని చంపడం ఈజీయే కదా అంటాడు అరవింద్‌.

రెడీ అయి కిందకు వచ్చిన అమర్‌ను ఇవాళ ఏమైనా స్పెషల్‌ ఉందా? అమర్‌ అంటూ మనోహరి అడుగుతుంది. ఏం లేదని పెళ్లి అయి చాలా రోజులు అయింది కదా? మిస్సమ్మను ఎక్కడికి తీసుకెళ్లలేదు కదా అందుకే బయటకు తీసుకెళ్తున్నాను అంటాడు అమర్‌. అయితే మీరిద్దరే వెళ్లితే బోర్‌ వస్తుంది కదా మేము అందరం వస్తాం అని మనోహరి అడగగానే ఏమీ వద్దని అమర్‌ చెప్తాడు. ఇంతలో మిస్సమ్మ రెడీ అయి కిందకు వస్తుంది. మిస్సమ్మను చూసిన అమర్‌ అచ్చం మీ అక్కలాగే ఉన్నావు అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×