OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా సినిమాలను చూసే మూవీ లవర్స్ కు ఒక మరాఠీ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ లవర్స్ ను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “సరళ ఏక్ కోటి” (Sarala ek koti). చదువు సంధ్య లేని ఒక అబ్బాయికి ఒక అందమైన అమ్మాయి భార్యగా వస్తే ఆ ఊరు జనం ఆమెను ఏ విధంగా ట్రీట్ చేస్తారో.. ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. భర్త భార్యను ఏవిధంగా కాపాడుకున్నాడో చివరివరకు సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతంలో బేకాజీ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇతనికి చదువు లేకపోయినా మంచి వాడిగా గుర్తింపు ఉండటంతో ఒక అందమైన అమ్మాయి ఇతనిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత బేకాజి ఇంటికి ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఆమె వైరల్ అయిపోతుంది. ఆమె ఫోటోలు కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు. ఆ ఫోటోలు బాగా హల్చల్ చేస్తాయి. ఆమెపై అందరికన్నూ పడుతుంది. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత సరళని కూడా పనికి తీసుకువెళ్తాడు ఆమె భర్త. అక్కడ బేకాజి కాంట్రాక్టర్ సరళ ని చూసి ఎలాగైనా ఆమెను అనుభవించాలని అనుకుంటాడు. ఒకసారి అతని ప్రయత్నాన్ని సరళ తిప్పి కొడుతుంది. ఈ విషయం తెలిసిన బేకాజీ సరలని మరొకచోట పనిలో పెడతాడు. వాళ్లు కూడా సరళని వేధిస్తారు. మరోవైపు ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని కాంట్రాక్టర్ ఒక పథకం పన్నుతాడు. బేకాజీ పేకాట ఆడకపోయినా పేకాట అంటే ఇష్టమని తెలుసుకుంటాడు. ఒకరోజు కాంట్రాక్టర్ పేకాట ఆడుతూ బేకాజీని కూడా పేకాట ఆడమంటాడు. డబ్బులు లేవని బేకాజీచప్పడంతో, నేను ఇస్తాను అని చెప్పి కాంట్రాక్టర్ బలవంతం చేస్తాడు. బేకాజీ కి మందు తాగిపిస్తూ పేకాట ఆడిపిస్తాడు కాంట్రాక్టర్. ఆటలో ఇంటితో సహా తన భార్యను కూడా తాగిన మత్తులో తాకట్టు పెడతాడు బేకాజీ. ఆ మరుసటి రోజు కాంట్రాక్టర్ బేకాజిని పంచాయతీలో పెడతాడు. ఆ ఊరి పెద్దలు బేకాజీకి మరో అవకాశం ఇవ్వాలని చెప్తారు.
అయితే నా అప్పు ఒక నెలలో తీర్చకపోతే బేకాజీ తన భార్యను ఒక సంవత్సరం పాటు నాతో పంపించాలని ఒప్పందం చేసుకుంటాడు కాంట్రాక్టర్. ఈ క్రమంలో డబ్బు కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు సరళని తనతో పంపమని అడుగుతూ ఉంటారు. చివరికి ఆ ఊరు ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తాను సరళని నాతో పంపమని బెదిరిస్తాడు. ఈ విషయంతో బాధపడుతున్న బైకాజీకి అప్పుడు మీడియా ఎదురవుతుంది. బెకాజి బాధపడుతూ ఉండడం చూసి మీడియా అతని దగ్గరికి వెళ్తుంది. వాళ్లకు జరిగిన విషయం అంతా చెప్తాడు బేకాజీ. మీడియాకి ఒక మంచి మసాలా న్యూస్ దొరకడంతో భేకాజి మ్యాటర్ వైరల్ అయిపోతుంది. ఆ తర్వాత బేకాజీ తన అప్పును తీర్చగలుగుతాడా? సరళని సంవత్సరం పాటు కాంట్రాక్టర్ దగ్గరికి పంపిస్తాడా? మీడియా వీళ్లకు సహాయం చేస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “సరళ ఏక్ కోటి” (Sarala ek koti) అనే మూవీ ని తప్పకుండా చూడండి.