BigTV English
Advertisement

OTT Movie : దయ్యాలు ఉన్నాయని తెలీక ఆ ఇంట్లోకి వెళ్తే…. కడుపుబ్బ నవ్వించే కామెడీ హర్రర్ మూవీ

OTT Movie : దయ్యాలు ఉన్నాయని తెలీక ఆ ఇంట్లోకి వెళ్తే…. కడుపుబ్బ నవ్వించే కామెడీ హర్రర్ మూవీ

OTT Movie : ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం మూవీలను ఎక్కువగా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే హర్రర్ సినిమాలు కొన్ని వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉంటే, మరికొన్ని కామెడీ తరహాలో తెరమీదకి తీసుకువస్తున్నారు దర్శకులు. అయితే కామెడీ తరహాలో వచ్చే హర్రర్ సినిమాలు కూడా ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్న ఒక హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఈరోజు మన మూవీ సజెషన్.ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఈ చైనీస్ కామెడీ హర్రర్ మూవీ పేరు ‘సీక్రెట్ ఇన్ ది హార్ట్ స్ప్రింగ్‘, (Secret in the heart spring). హీరో తన స్నేహితులతో కలసి సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ తన స్నేహితులతో కలసి కొన్ని దయ్యాలను ఎదుర్కొనే సన్నివేశాలు కడుపుబ్బనవిస్తాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

జిన్ ఒక డూప్లికేట్ గోస్ట్ హౌస్ లో పిల్లల్ని భయపెట్టే జాబ్ లో పార్ట్ టైం గా చేస్తుంటాడు. చదువుకుంటూ ఈ జాబ్ ను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక పిల్లవాడు జిన్ ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండటంతో, అతనిని దయ్యం రూపంలో బెదిరిస్తాడు. ఆ పిల్లవాడు ఎక్కువగా ఏడవడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన ఇతనిపై కొంతమంది దాడి చేయడానికి వస్తారు. అయితే ఇతనికి ఫైటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండటంతో వాళ్లను తిరిగి గట్టిగా కొడతాడు. ఇతని ఫైటింగ్ స్కిల్స్ చూసి హోం, లిన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్ అవుతారు. అయితే జిన్ కి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా ఉండటంతో, దెబ్బలు తిన్న గ్యాంగ్ వీళ్ళ పై కోపంగా ఉంటుంది. ఒకరోజు జిన్ తాతకు హెల్త్ బాగా లేకపోవడంతో ఊరికి వెళ్దామని రెడీ అవుతాడు. అతడు వెళ్ళిపోతే ఈ రౌడీ గ్యాంగ్ కొడతారని భయంతో, వీళ్ళు కూడా అతనితోపాటు వస్తామని చెప్తారు.

వీళ్ళు ముగ్గురు కలసి ఊరికి బయలుదేరుతారు. అక్కడ ఇతన్ని రప్పించడానికి తాతయ్య అబద్ధం చెప్పి ఉంటాడు. జిన్ తాతయ్య దట్టమైన అడవిలో ఒక హోటల్ నడుపుతూ ఉంటారు. అక్కడికి ఎవరు వస్తారో ఏమో కూడా తెలియదు. ఆ ఇంటికి వీళ్ళు వెళ్లిన తర్వాత కొన్ని వింత ఆకారాలు భయపెడుతూ ఉంటాయి. వీళ్ళు ఆ ఆకారాలను చూసి వణికి పోతూ ఉంటారు. జిన్ మాత్రం ఆ దయ్యాలను పచ్చి బూతులు తిడుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటాయి. చివరికి వీళ్లను భయపెట్టిన ఆ దయ్యాలు నిజమైనవేనా? ఆ దయ్యాలను జిన్ ఎలా ఎదుర్కొంటాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సీక్రెట్ ఇన్ ది హార్ట్ స్ప్రింగ్’, (secret in the heart spring) అనే హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×