BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: బ్రేకప్ తర్వాత ప్రేరణ పిచ్చి పని.. ఆ అమ్మాయి కోసం జీవితాంతం ఎదురుచూస్తానంటున్న నిఖిల్

Bigg Boss 8 Telugu: బ్రేకప్ తర్వాత ప్రేరణ పిచ్చి పని.. ఆ అమ్మాయి కోసం జీవితాంతం ఎదురుచూస్తానంటున్న నిఖిల్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరంతా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి వీరి పర్సనల్ లైఫ్ గురించి చాలానే విషయాలు పంచుకున్నారు. వీరి రిలేషన్‌షిప్, వైవిహిక జీవితం.. ఇలాంటి చాలా విషయాలను తోటి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులతో కూడా షేర్ చేసుకున్నారు. అలాంటి కంటెస్టెంట్స్ నుండి మరికొన్ని పర్సనల్ విషయాలు రాబట్టడానికి సీరియల్ ఆర్టిస్టులు హౌస్‌లో అడుగుపెట్టారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తూ వారి పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు మరింత ఎక్కవ తెలిసేలా చేశారు కంటెస్టెంట్స్. ముఖ్యంగా నిఖిల్ పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి మొదలయ్యింది.


అభిప్రాయాన్ని గౌరవిస్తాను

ముందుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ‘బ్రహ్మముడి’ కావ్య అలియాస్ దీపికా ఎంటర్ అయ్యింది. తను రావడంతోనే రచ్చ మొదలయ్యింది. హౌస్‌లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లో చాలామందికి దీపికా క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఆలోచించకుండా జోకులు వేసింది. అందరినీ ఎంటర్‌టైన్ చేసింది. మధ్యలో కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడా వారిని అడిగింది. గౌతమ్‌కు పెళ్లి జరిగిన తర్వాత, ఆ అమ్మాయికి తనంటే ఇష్టం లేదని తెలిస్తే ఏం చేస్తావని అడిగింది దీపికా. ఇష్టం లేని మనిషితో కలిసుండడం కరెక్ట్ కాదని తనను వదిలేస్తానని చెప్పాడు. అయితే హౌస్‌లో కూడా తాను అలాగే ఉంటున్నాడని, వేరేవాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తున్నాడని ప్రశంసించింది దీపికా.


Also Read: అవినాష్‌కు గెలుపు శాతం ఎంతంటే.?

జీవితాంతం ఎదురుచూస్తాను

‘‘నీకు నచ్చిన అమ్మాయి నీతో బ్రేకప్ చేసుకొని వెళ్లింది. అయినా నీకు తనపై ఫీలింగ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు తనకోసం వెయిట్ చేస్తావా’’ అని నిఖిల్‌ను ప్రశ్నించింది దీపికా. ఒకవేళ తనపై ఫీలింగ్స్ ఉంటే కచ్చితంగా ఎదురుచూస్తానని చెప్పాడు. జీవితాంతం వేరేవాళ్లను పెళ్లి చేసుకోకుండా ఎదురుచూస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీపికా వెళ్లిపోయిన తర్వాత సీరియల్ ఆర్టిస్టులు ఆకర్ష్, సుహాసిని హౌస్‌లోకి వచ్చారు. తాము కలిసి నటిస్తున్న ‘మామగారు’ అనే సీరియల్‌లో తాము విడాకులు తీసుకొని విడిపోతున్నట్టుగా చెప్పారు. అదే సందర్భంగా కంటెస్టెంట్స్‌ను కూడా తమ బ్రేకప్ స్టోరీలు అడిగి తెలుసుకున్నారు.

చేతికి గాయం

ముందుగా ప్రేరణ తన బ్రేకప్ స్టోరీ చెప్పింది. తనకు నచ్చిన అబ్బాయితో విడిపోయిన తర్వాత ఒక రాయితో తన చేతికి ఘోరమైన గాయం చేసుకున్నానని, ఇప్పటికీ ఆ మచ్చ అలాగే కనిపిస్తుందని బయటపెట్టింది. కానీ కొన్నిరోజుల తర్వాత తాను చేసింది పిచ్చిపని అని అర్థం చేసుకొని దాని నుండి బయటపడ్డానని తెలిపింది. నిఖిల్.. తన బ్రేకప్ తర్వాతే హీరో అయ్యానని, అప్పుడు థియేటర్ల దగ్గర తన కటౌట్ చూసి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ తనకు ఫోన్ చేసిందని, అయినా తానే బ్లాక్ చేశానని గర్వంగా చెప్పాడు. ఆ బ్రేకప్ తన మంచికే జరిగిందని అన్నాడు. ఎవరైనా తన మంచి కోసం తనను వదిలేయానుకుంటే అలాంటి ప్రేమను జీవితాంతం పక్కనే పెట్టుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు నిఖిల్.

Related News

Bigg Boss 9 Telugu Day 63 : దివ్యకు నాగార్జున మాస్ వార్నింగ్… వీడియోలతో బండారం బట్టబయలు… తనూజా చేతుల్లో ఎలిమినేషన్

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Big Stories

×