BigTV English

OTT Movie : ఇంటి ముందే శవాలు పారేసి పోలీసులనే ఇరికించే బ్యాచ్… క్లైమాక్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్

OTT Movie : ఇంటి ముందే శవాలు పారేసి పోలీసులనే ఇరికించే బ్యాచ్… క్లైమాక్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్

OTT Movie : మర్డర్ మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. కొన్ని సినిమాలు క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. సినిమా చూస్తున్నంత సేపు ట్విస్టుల మీద ట్విస్టులతో క్లైమాక్స్ వరకు కనీసం పక్కకు కదలకుండా కూర్చోబెట్టగలిగే గ్రిప్పింగ్ స్టోరీతో తెరకెక్కింది ఈ మూవీ. మరి ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో క్రిమినల్స్ ఏకంగా పోలీసులకే చుక్కలు చూపిస్తారు. శవాలను పోలీస్ ఆఫీసర్ల ఇంటిముందే పెట్టి వాళ్ళనే ఇరికించే మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరు తలవన్. ఈ మూవీ సెప్టెంబర్ 10 నుంచి ఓటిటిలోకి వచ్చేసింది. ఈ మలయాల డ్రామాను సోని లీవ్ లో చూడొచ్చు.


Thalavan' box office collections day 16: Asif Ali starrer crosses Rs 11 crores | - Times of India

స్టోరీ లోకి వెళ్తే…

ఓ పోలీస్ ఆఫీసర్ తమ పరిధిలో అంతకుముందు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు గురించి లైవ్లో చెప్తూ ఉంటాడు. ఓ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కొత్తగా జాయిన్ అవుతాడు. అతనికి అతని పై అధికారికి అస్సలు పడదు. అయితే ఈ క్రమంలోనే ఎస్ఐకి తెలిసిన వ్యక్తి ని ఒక కేసులో తీసుకొచ్చి జైల్లో పారేస్తారు. అయితే సిఐకి తెలియకుండానే ఎస్ఐ అతన్ని విడిపిస్తాడు. దీంతో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. అతను ఒక కేబుల్ ఆపరేటర్. తనను అరెస్ట్ చేశాడు అన్న కారణంగా ఏకంగా సీఐ భార్యపై కత్తితో దాడి చేస్తాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత కేబుల్ ఆపరేటర్ కి జైలు శిక్ష పడుతుంది. అయితే కేబుల్ ఆపరేటర్ భార్య తరచుగా సిఐని కలుస్తూ తన భర్తని విడిపించమని వేడుకుంటుంది. ఒకానొక టైంలో ఆయనను విడిపిస్తానంటే ఆయన చెప్పిన ఒక సీక్రెట్ ని మీకు చెప్తానని చెప్తుంది. కానీ సిఐ వినడానికి సిద్ధంగా ఉండడు. ఇక ఓ రోజు సీఐ తన ఫ్రెండ్ తో కలిసి పార్టీ చేసుకుంటాడు. అక్కడికి ఎస్ఐని కూడా మాట్లాడడానికి పిలుస్తారు. ఆ తర్వాత రోజే కేబుల్ ఆపరేటర్ భార్య సిఐ ఇంటి మెడపై శవమై కనిపిస్తుంది. అయితే ఇద్దరికీ ఏదో లింక్ ఉందనే రూమర్లు ఉండడంతో పాటు అతని ఇంట్లో శవం దొరకడంతో సిఐని అరెస్ట్ చేస్తారు. ఈ కేసుని ఎస్ఐ ఇన్వెస్టిగేట్ చేయాలని ఆదేశిస్తారు. ఆ తర్వాత దీనంతటికీ కారణం ఎవరు అన్న విషయాన్ని ఓవైపు ఎస్ఐ మరోవైపు సిఐ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతలోనే ఎస్సై ఈ కేసులో లీడ్ గా ఉన్న వ్యక్తిని కొట్టి చంపాడు అని ఆధారాలు దొరికేలా అతని ఇంటి ముందే సాక్షి శవం దొరుకుతుంది. దీంతో సిఐ ఎస్ఐకి విషయాన్ని అర్థమయ్యేలా చెప్తాడు. ఎవరో కావాలని ఇరికిస్తున్నారు అని అర్థం చేసుకున్న ఇద్దరు అక్కడ్నుంచి ఎస్కేప్ అవుతారు. చివరికి ఈ ఇద్దరు పోలీసులు తాము క్రిమినస్ కాదని ఎలా నిర్మించుకున్నారు? అసలు ఇదంతా చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే విషయాలు తెలియాలంటే తలవన్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

Big Stories

×