OTT Movie : హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూడాలంటే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలతో టెన్షన్ పడుతూ థ్రిల్ అవుతూ ఉంటారు. ఎప్పటినుంచో హర్రర్ సినిమాలు ట్రెండ్ క్రియేట్ చేసాయి. ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో 1982 లో వచ్చిన ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? స్టోరీ ఏమిటో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ఎంటినిటీ‘ (The entinity). ఈ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కంటికి కనిపించని ఒక ఆత్మ హీరోయిన్ పై అఘాయిత్యం చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మను హీరోయిన్ ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
హీరోయిన్ కి తన భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో కంటికి కనిపించని ఒక ఆత్మ హీరోయిన్ పై రోజు రాత్రి అఘాయిత్యం చేస్తూ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి చెబితే ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. తన ఫ్రెండ్ కి ఈ విషయం చెప్పి బాధపడుతుంది. ఆమె ఒక సైకాలజిస్ట్ ని కలవమని చెప్తుంది. అక్కడ డాక్టర్లు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఫీల్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉందని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తారు. నిజానికి ఆ డాక్టర్లు ఆమె చెప్పే విషయం నమ్మరు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకుంటారు. చివరికి హీరోయిన్ తన మీద పడ్డ గాయాలను తన ఫ్రెండ్ కి చూపిస్తుంది. వీళ్ళిద్దరూ ఆత్మలను తరిమికొట్టే పుస్తకాల కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ ఆత్మలపై రీసెర్చ్ చేసే సైకాలజిస్ట్లు ఈమెకు పరిచయం అవుతారు. వాళ్లకి ఈ విషయం చెప్పి హీరోయిన్ ఆ సైకాలజిస్ట్లును ఇంటికి తీసుకుని వెళుతుంది.
ఆరోజు వీళ్ళంతా ఉండటంవలన ఆ దయ్యం ఆమెను ఏమీ చేయదు. డాక్టర్లు ఆమెకు ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటారు. ఆ డాక్టర్లు వెళ్లిపోయాక మళ్ళీ ఆత్మ వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండటంతో చివరికి హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కార్ కీస్ మరచిపోవడంతో దాని కోసం మళ్లీ లోపలికి వస్తుంది. ఆ ఇంట్లోకి మళ్లీ వచ్చిన హీరోయిన్ ను ఆత్మ ఏం చేస్తుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరు? నిజంగానే ఈమెపై అఘాయిత్యం చేస్తుందా? హీరోయిన్ మానసికస్థితి సరిగ్గా లేదా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ది ఎంటినిటీ (The entinity) అనే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.