Intinti Ramayanam Today Episode December 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇష్టమైన బైకు దక్కలేదనే బాధ కూడా కమల్ భోజనం చేస్తూ సాంబార్ పోయి అని తింటాడు. భానుమతి అక్కడికి వస్తుంది. కమల్ ను చూసి కొంచెం కూడా సిగ్గు అనేది లేరాదా? ఎందుకలా తింటున్నావ్ అనేసి అనగానే ఆకలికి బాధకి లింక్ ఏంటి ముసలి నాకు ఆకలేస్తుంది తింటున్నాను అనేసి అంటాడు. వీడి అమాయకత్వాన్ని చూసి సంతోషపడాలో బాధలను మర్చిపోతున్నాడని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అనేసి పార్వతి మనసులో అనుకుంటుంది. పార్వతి వెళ్లి పల్లవిని భోజనానికి రాలేదేంటి నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అడుగుతుంది. భోజనం చేయాలని లేదు అత్తయ్య ఆకలిగా లేదు అక్షయ్ బావ చేసింది తలుచుకుంటే బాధగా ఉంది. అక్షయ్ ఇలా చేస్తాడని నేను కూడా అస్సలు ఊహించలేదు అనేసి పార్వతి అంటుంది. రేపు మేము మా పిల్లలు పుడితే డైపర్లు కొనాలి అన్న వేరే వాళ్ళ మీద ఆధారపడాలి అడుక్కోవలసిన పరిస్థితి కదా అత్తయ్య అంటే మాకు ఈ ఆస్తి ఎటువంటి హక్కు లేదా అనేసి అడుగుతుంది. అలా ఎందుకు అనుకుంటావ్ అమ్మ పల్లవి నేను అక్షయ రాగానే ఏమైందో కనుక్కుంటాను నువ్వు రా భోజనం చేయద్దు అనేసి అడుగుతుంది. కానీ పల్లవి మాత్రం నాకు ఆకలిగా లేదా అత్తయ్య నేను మా ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్తున్నానని చెప్తుంది. అత్తయ్య నాకు నీ డైమండ్ నెక్లెస్ కావాలి వేసుకోవచ్చా అని అడుగుతుంది.
అవని దగ్గర తాళాలు తీసుకొని పల్లవికి నెక్లేస్ ఇవ్వాలని పార్వతి అనుకుంటుంది. లాకర్ ఓపెన్ చెయ్యగానే అక్కడ డబ్బులు ఉండటం చూసి షాక్ అవుతుంది. అవనిని గట్టిగా అరుస్తుంది. డబ్బులు ఉన్నా కూడా లేవని ఎందుకు చెప్పావు అనేసి అడుగుతుంది. ఇక భానుమతి అనాధను తీసుకొచ్చి పెత్తనానికి పెద్దను చేశావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా పార్వతి నేను ఎందుకు అంటున్నానో.. అవని పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమయిపోయింది అనేసి కోపంగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక భానుమతి కమల్ని క్లాసిక్ పీకుతుంది. మా వదిన కొత్త బైక్కి డబ్బులు ఇస్తుంది నేను మా వదిన బైక్ మీద తీసుకొని వెళ్తాను అనేసి గంతులేసావు కదా ఇదిగో మీ వదిన నీకు బైక్ కొనివ్వడం ఇష్టం లేక డబ్బులు లేవని చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకోరా పిచ్చి సన్యాసి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాకర్ లో డబ్బులు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. లాకర్లలోకి అంత డబ్బులు ఎలా వచ్చాయి ఎవరు పెట్టారు ఇదంతా పల్లవి పనే అనేసి అనుకోగానే పల్లవి ప్రత్యక్షమవుతుంది. అవునక్కా నువ్వు గెస్ చేసింది అక్షరాల నిజం నేనే ఆ డబ్బుల్ని లాకర్లో పెట్టాను నీకు ముందు ముందు ఇలాంటి ఏడుపులు బాధలు చాలానే ఉంటాయి నువ్వు నేను ఇలాంటివన్నీ మానుకోవాలంటే నువ్వు అక్షయ్ బావ ఇంట్లోంచి వెళ్లి పోవాల్సిందే అంటుంది. నీ గురించి సాక్షాలతో సహా అందరికీ చెప్పడం నాకు పెద్ద పని కాదు. నీ గురించి చెప్పగానే మావయ్య నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అలా చెప్తే నాకేమీ రాదు బంధాలు బంధుత్వానికి విలువ ఇచ్చాను కాబట్టే నీకు మంచిగా చెప్తున్నాను నా మంచితనాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు అనేసి వార్నింగ్ ఇస్తుంది.. దానికి పల్లవి కూడా నువ్వేం చెయ్యలేవు. ఇంట్లో ఒక్కొక్కరు శత్రువులుగా మారిపోతారు. ఏడవడానికి రెడీ గా ఉండు అనేసి ఛాలెంజ్ చేస్తుంది.. పల్లవి ఆటలు ఎలాగైన కట్టడి చెయ్యాలి అని అనుకుంటుంది.. నా వల్ల కమల్ బాధ పడ్డాడు అనేసి అనుకుంటుంది. ఇక రాత్రి అక్షయ్ లేటుగా ఇంటికి వస్తారు. ఇక ఉదయం లేవగానే ఆరాధ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.. ఇక అవని కూడా విషెస్ చెప్తుంది. ఆరాధ్య ఈరోజు నువ్వు మమ్మి చెప్పినట్లే వినాలి చెయ్యాలని ఆర్డర్ వేస్తుంది. దానికి అక్షయ్ ఒప్పుకుంటాడు.
కొడుకు పుట్టినరోజున అన్ని తానే చెయ్యాలని పార్వతి అనుకుంటుంది. నలుగు పెట్టి స్నానం చేయించాలని అనుకుంటుంది. కాని అవని అన్ని తానే చేస్తుంది. బయట నలుగు పెట్టి స్నానం చేయిస్తుంది. అలాగే పార్వతి సెలెక్ట్ చేసిన డ్రెస్సును పక్కనపెట్టి అవని తెచ్చిన డ్రెస్సును వేసుకోవాలని అవని డ్రెస్ అక్కడ పెడుతుంది. కిందకు రెడీ అయ్యి వస్తాడు అక్షయ్.. తాను ఇచ్చిన డ్రెస్సు వేసుకోకుండా అవని ఇచ్చిన డ్రెస్ వేసుకోవడం చూసి పార్వతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.