Perni Nani-Kittu Arrest: మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో డోర్లకు నోటీసులు అంటించారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ
ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని నోటీసుల్లో కోరారు పోలీసులు. మధ్యాహ్నం 2గంటల లోపు స్టేషన్ కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
గత నెల చివర్లో ఈ నెల మొదటి వారం తనిఖీలు రేషన్ బియ్యానికి వైసీపీ లీడర్లకు ఉన్న సబంధమేంటో తెలీదు కానీ.. మొన్నటి వరకూ కాకినాడ తీరాన్ని ఒక ఊపు ఊపిన రేషన్ తుఫాన్ ప్రస్తుతం మచిలీపట్నం తీరానికి చేరింది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై ఇటీవల కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.. కృష్ణాజిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు బందరు పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
మచిలీపట్నం మండలం, పొట్లపాలెంలో తన సతీమణి జయసుధ పేరిట గోడౌన్ నిర్మించారు పేర్ని నాని. దీన్ని సివిల్ సప్లైస్ శాఖకు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. కొద్ది రోజుల క్రితం పేర్ని జయసుధకు చెందిన గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు.
Also Read: కంగారుపడుతున్న జగన్.. ఏం జరుగుతోంది?
ఈ చెకింగుల్లో గోడౌన్లో ఉన్న సరుకులో వ్యత్యాసం గుర్తించారు అధికారులు. మొత్తం 185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్టు గమనించారు పౌరసరఫరాల శాఖ అధికారులు.. తాము గుర్తించిన విషయాన్ని.. ఫిర్యాదులో పేర్కొన్నారు కోటిరెడ్డి. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా పోలీసులకు కంప్లయింట్ చేశారు అధికారులు.
నానిపై క్రిమినల్ కేసులతో పాటు.. కోటి 80 లక్షల రెట్టింపు జరిమానా విధించాలని సివిల్ సప్లైస్ సీఎండి ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నంలో నానికి చెందిన 4వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌ని 2020లో లీజుకు తీసుకుంది ప్రభుత్వం. తన గోడౌన్‌లో ఉన్న బియ్యంలో తరుగు వచ్చిందని గత నెల 27న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కి లేఖ రాశారు నాని. దాదాపుగా 3200 బస్తాల్లో తరుగు ఉందని.. ఈ మేరకు తాను సొమ్ము చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు నాని. నాని లేఖ రాయడంతో గత నెల చివర్లో, ఈ నెల మొదటి వారంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా బయట పడ్డ నిల్వ తరుగుపైనే తండ్రీకొడుకులు ఇద్దరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.