OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు అభిమానులు ఒక రేంజ్ లో ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలలో కొన్ని సీన్స్ కోసమే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలలో ఈ సీన్స్ చాలానే ఉంటాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అటువంటి ఒక రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది లవర్ ఇన్ ది అటిక్” (The Lover in the Attic). ఈ మూవీలో హీరోయిన్ ఒక మోడల్ గా ఉంటుంది. డబ్బు కోసం వయసు అయిపోయిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో, హీరోయిన్ జీవితం ఎలా మలుపు తిరుగుతుందనే విషయం పై మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక మోడల్ గా ఉంటూ సినిమాలలో పైకి రావాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఫ్రెడ్ అనే డబ్బున్న వ్యక్తి పరిచయం అవుతాడు. అతడు బాగా రిచ్ కావడంతో, అతనిని పెళ్లి చేసుకుంటే తన కెరీర్ కి ఉపయోగపడతాడని అనుకుంటుంది. అయితే అతడు వయసులో చాలా పెద్దవాడు కావడంతో కాస్త ఆలోచించినా, డబ్బు బాగా ఉండటంతో అతనిని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లయిన తర్వాత ఫ్రెడ్ ఆమెను ఇంటికి మాత్రమే పరిమితం చేస్తాడు. ఆమె ఆశలన్నీ ఆవిరి అయిపోతాయి. అయితే ఫ్యాషన్ ఎలాగూ లేదు, కనీసం భర్తతో కూడా ఆ ముచ్చట సరిగ్గా ఉండదు. ఈమె మోడల్ కావడంతో ఆమె ఇంటికి ఒక టైలర్ వస్తాడు. అతడు చూడడానికి అందంగాను, వయసులో ఉండటంతో అతని మీద మనసు పరేసుకుంటుంది హీరోయిన్. అతనిని రెచ్చగొడుతూ తన వైపు తిప్పుకుంటుంది. భర్త బయటికి పోగానే అతనిని ఇంటికి పిలిపించుకుంటుంది.
బయట వాళ్లకి మన విషయం తెలుస్తుందేమోనని టైలర్ హీరోయిన్ కు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అతనిని తన ఇంటి పైన ఒక చిన్న గదిలో ఉంచుకుంటుంది. ఇక అతను బయటికి వెళ్లే అవసరం లేకుండా అక్కడే మూడు సంవత్సరాలు ఉంటాడు. ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతూ చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరోజు హీరోయిన్ ను భర్త ఒక పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ హీరోయిన్ అతనితో డాన్స్ వేయకపోవడంతో, గొడవ పడి మళ్లీ ఇంటికి వస్తారు. ఈ విషయం తెలియని టైలర్ ఆ ఇంట్లో వీళ్లకు దొరికిపోతాడు. చివరికి ఫ్రెడ్, టైలర్ని ఏం చేస్తాడు? వీరి విషయం ఫ్రెడ్ కి తెలుస్తుందా? హీరోయిన్ తన భర్తను ఏం చేస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. మూవీలో కొన్ని సన్నివేశాలు వేడి పుట్టించే విధంగా ఉంటాయి. మీరు ఈ మూవీని ఒంటరిగా చూడడమే మంచిది.