Jhansi medical college tragedy: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఝాన్సీ మెడికల్ కాలేజీలోని చిన్నారుల వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలేం జరిగింది?
యూపీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పదిన్నర గంటల నుంచి పదకొండున్నర మధ్యలో చిన్నపిల్లల నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
ఘటన జరిగిన సమయంలో ఆ వార్డులో 47 మంది చిన్నారులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగగానే పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు బయటకు పరుగెత్తారు. ఈ సమయంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేటు చేసుకుంది.
డెలివరీకి వచ్చిన మరికొందరి మహిళలను ఆసుపత్రి నుంచి బయటకు తరలించారు. ఈ క్రమంలో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. మరో 37 మందిని రక్షించారు.
ALSO READ: మద్య నిషేధ చట్టం పోలీసులకే బాాగా ఉపయోగపడింది – పట్నా హైకోర్టు.. ఎందుకంటే?
మంటల సమయంలో దట్టమైన పొగలు ఆసుపత్రి లోపల వ్యాపించాయి. ఊపిరాడక కొందరు శిశువులు మృత్యువాత పడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఫైటర్లు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ అవినాష్‌కుమార్, జిల్లా యంత్రాంగమంతా అక్కడికి చేరుకుంది. సహాయ చర్యలను పర్యవేక్షించింది. ట్రీట్‌మెంట్ కోసం చిన్నారులను మరో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్, విచారం వ్యక్తం చేశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటన పై వెంటనే విచారణ చేపట్టాలన్నారు.
సీఎం యోగి ఆదేశాలతో డిప్యూటీ సీఎం, బ్రిజేశ్ పాఠక్, హెల్త్ సెక్రటరీ వెంటనే లక్నో నుంచి ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయన్నది అధికారుల మాట. విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం..
ఉత్తరప్రదేశ్ – ఝాన్సీ మెడికల్ కాలేజీలోని చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు
ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.#Uttarpradesh #FireAccident #BigTV pic.twitter.com/TblqwkcHEn
— BIG TV Breaking News (@bigtvtelugu) November 16, 2024