OTT Movie : హర్రర్ మూవీలకు ఓటీటీలో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ మూవీస్ మూవీ లవర్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. పగలు ఈ మూవీలను చాలామంది చూస్తారు. అయితే రాత్రిపూట చూడాలంటే కాస్త గుండె ధైర్యం కావాల్సిందే. అందులోనూ హాలీవుడ్ హర్రర్ మూవీస్ ప్రేక్షకులను కాస్త ఎక్కువగానే భయపెడతాయి. అలా భయపెట్టే ఒక హర్రర్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకునే హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “ది మెసెంజర్స్” (The Messengers). ఒక కుటుంబం దయ్యాలు ఉన్నాయన్న విషయం తెలియక ఒక ఇంటిని కొని అందులో ఉంటూ వ్యవసాయం చేస్తారు. ఆ ఇంట్లో దయ్యాలను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
చార్లీ, మేరీ అనే భార్య భర్తలు కొత్తగా ఒక ఇల్లును కొంటారు. అందులో పిల్లలు జెస్సికా, బెన్ లతో కలసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయన్న విషయం వీరికి తెలియదు. తక్కువ ధరకే వస్తుందని ఆ ఫ్యామిలీ ఆ ఇంటిని కొంటారు. అప్పటినుంచి ఆ ఇంట్లో పిల్లలకు దయ్యాలు కనబడుతూనే ఉంటాయి. వీరు వ్యవసాయం చేస్తుండగా ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి పని కావాలని అడుగుతాడు. తనకు ఫుడ్ పెడితే సరిపోతుందని వారితో కలిసి వ్యవసాయం చేస్తాడు. ఒకరోజు చార్లీ కి దెబ్బ తగలడంతో హాస్పిటల్ కి వెళ్తారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఆ దయ్యాలు కనబడి, వీళ్లను ఇబ్బంది పెడుతూ ఇంట్లోని వస్తువులను పగలగొడుతూ ఉంటాయి. జెస్సికా పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. అయితే పోలీస్ ఇంటికి వచ్చి చూస్తే అన్ని బాగానే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోతారు.
ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి హీరోయిన్ ఆ ఊర్లో ఉన్న ఒక యువకుడిని అడిగి సమాచారం తెలుసుకుంటుంది. ఆ ఇంట్లో ఇదివరకు ముగ్గురు వ్యక్తులు ఉండేవాళ్ళు. వాళ్లు ఏమయ్యారో కూడా మాకు తెలియదంటూ ఆ వ్యక్తి ఆమెకు తెలియజేస్తాడు. ఆ తరువాత ఆ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ ఇంట్లో పిల్లలకు మాత్రమే దయ్యాలు ఎందుకు కనపడుతున్నాయి? ఆ దయ్యాల వల్ల చార్లీ ఫ్యామిలీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? చివరికి వాళ్లు ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ది మెసెంజర్స్” (The Messengers) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉంటాయి. ఈ మూవీ ని కాస్త గుండె ధైర్యం ఉన్నవాళ్లు చూస్తేనే బెటర్.