Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లోకి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది. కానీ ఏ కంటెస్టెంట్‌కు అయితే ఇతర కంటెస్టెంట్స్ సపోర్ట్‌గా ఉంటుందో వారికే ఎవిక్షన్ షీల్డ్ దక్కితుందుని బిగ్ బాస్ ప్రకటించారు. అయితే ఈ టాస్క్ ఎలా మొదలయ్యిందో అలా ముగిసిపోలేదు. టేస్టీ తేజ, యష్మీ కలిసి ఒక కంటెస్టెంట్ పేరు చెప్పమని అనగా వారిద్దరూ ఒక మాట మీదకు రాలేదు. యష్మీ ఏమో రోహిణిని ఎవిక్షన్ షీల్డ్ రేసు నుండి తప్పిద్దామంటే తేజ మాత్రం నిఖిల్ పేరు చెప్పడంతో వారిద్దరూ ఒక మాట మీదకు రాలేకపోయారు. అలా చివరి వరకు నబీల్, నిఖిల్, రోహిణి.. ఎవిక్షన్ షీల్డ్ రేసులో నిలబడగా.. వారిలో ఒకరిని ఎవిక్షన్ షీల్డ్ దక్కేలా టాస్క్‌ను పూర్తి చేయించారు నాగార్జున.
ఎవరు ఎవరికి సపోర్ట్
నిఖిల్, నబీల్, రోహిణిలో ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి దక్కాలని కంటెస్టెంట్స్ అనుకుంటారో వారంతా ఈ ముగ్గురిలో ఒకరికి ఓటు వేస్తూ వారిని ముందుకు నడిపించొచ్చు అని నాగార్జున చెప్పారు. ముందుగా మెగా చీఫ్ కాబట్టి ప్రేరణ ఎవరికి సపోర్ట్ చేస్తుందని నాగ్ అడిగారు. తను రోహిణి పేరు చెప్పింది. స్వార్థం లేకుండా ఆ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి అవసరమో.. రోహిణి వారికే ఉపయోగిస్తుందని నమ్మకం ఉందని తెలిపింది. హరితేజ వచ్చి నిఖిల్ పేరు చెప్పింది. తనకు అవసరం లేదని చెప్పినా కూడా మళ్లీ మళ్లీ నిఖిల్‌కే సపోర్ట్ చేస్తోంది హరితేజ. ఆ తర్వాత వచ్చిన గౌతమ్.. నబీల్‌కు సపోర్ట్ చేశాడు. నబీల్ ఆలోచనలు, తన ఆలోచనలు ఒకేలా ఉంటాయని చెప్పాడు.
Also Read: హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్.? మరోసారి అదే కారణం..
రోహిణి అనర్హురాలు
గంగవ్వ వచ్చి రోహిణి తన మనవరాలులాగా బాగా చూసుకుంటుందని, అందుకే తనకే సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది. విష్ణుప్రియా వచ్చి నిఖిల్‌కు సపోర్ట్ చేసింది. ఆ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఎప్పుడు ఉపయోగపడుతుందో ఆలోచించే శక్తి నిఖిల్‌కు ఉందని చెప్పింది. టేస్టీ తేజ వచ్చి రోహిణి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పాడు. యష్మీ వచ్చి నిఖిల్‌కు సపోర్ట్ చేస్తుందనుకుంటే తను నబీల్‌కు సపోర్ట్ చేసి వెళ్లిపోయింది. తర్వాత వచ్చిన పృథ్వి మాత్రం తన ఫ్రెండ్ నిఖిల్‌కే మద్దతునిచ్చాడు. రోహిణి, నబీల్‌లో ఎవరికైనా ఎందుకు ఇవ్వడం లేదంటే రోహిణి అనర్హురాలు అని ముక్కుసూటిగా చెప్పేశాడు. అవినాష్ వచ్చి తను మెగా చీఫ్ అవ్వడానికి నబీల్ కారణం కాబట్టి తనకు సపోర్ట్ చేస్తున్నానని అన్నాడు.
ప్రేరణదే నిర్ణయం
కంటెస్టెంట్స్ అంతా తమ మద్దతు తెలపడం పూర్తయ్యే సమయానికి నిఖిల్, నబీల్, రోహిణిలకు సమానంగా ఓట్లు పడ్డాయి. అందుకే ఆ ముగ్గురి ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుందామనుకున్నారు. అప్పుడు నబీల్.. నిఖిల్‌కు, రోహిణి.. నబీల్‌కు, నిఖిల్.. రోహిణికి సపోర్ట్ చేశారు. దీంతో మళ్లీ కన్‌ఫ్యూజన్ మొదలయ్యింది. అందుకే ఫైనల్‌గా మెగా చీఫ్ అయిన ప్రేరణను నిర్ణయం తీసుకోమన్నారు నాగార్జున. తను వచ్చి నబీల్ పేరు చెప్పి తనకు ఎవిక్షన్ షీల్డ్ దక్కేలా చేసింది. ఇక ఎవిక్షన్ షీల్డ్ దక్కినందుకు నబీల్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. తనకు ఇద్దరిని సపోర్ట్ చేసే అవకాశం వస్తే ముందుగా రోహిణికి, ఆ తర్వాత నబీల్‌కు సపోర్ట్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యానని చెప్పింది ప్రేరణ.