OTT Web Series : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు అనతి కాలంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ లు మాత్రం డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉంటే ఎటువంటి వెబ్ సిరీస్ ల నైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఒక వెబ్ సిరీస్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ పేరు “సంపూర్ణ” (sampurna). కొత్తగా పెళ్లయిన ఒక జంట కి ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఆ ఫస్ట్ నైట్ రోజు భర్త, భార్యని ఎంతలా భయపెట్టాడో స్టోరీలో తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సంపూర్ణ ఒక సాధారణ గృహిణిగా ఉంటూ తన భర్తతో కలసి జీవిస్తూ ఉంటుంది. ఈమెకు ఒక పెళ్లి కావలసిన మరిది కూడా ఉంటాడు. ఇతనికి పెళ్లి సంబంధాలు చూస్తూ, ఒక సంబంధాన్ని సెట్ చేస్తారు కుటుంభసభ్యులు. అయితే జాతకాలు కలవలేదని సంపూర్ణ అత్తగారు, పెళ్లి క్యాన్సిల్ చేద్దామనుకుంటుంది. ఆ తర్వాత సంపూర్ణ మధ్యలో కలగజేసుకొని జాతకాలు కలవాలంటే ఒక పూజ చేస్తే సరిపోతుందని చెప్పి, మరిదికి నందిని అనే అమ్మాయితో పెళ్లిని జరిపిస్తుంది. నందినిని ఫస్ట్ నైట్ రోజు మరిది గదిలోకి పంపిస్తారు. ఆ రాత్రి మరిది ఆమెతో ఆ సమయంలో చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఆమె బయటికి వచ్చి ఏడుస్తూ ఉండడం చూసిన సంపూర్ణ, మొదట కొత్తగానే ఉంటుంది తర్వాత సర్దుకుంటుందిలే అని చెప్తుంది. అయితే అతడు అలా ప్రవర్తిస్తున్న విషయంఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది నందిని. హనీమూన్ కి వీళ్లను పంపాలని చూస్తారు. నందిని మాత్రం భయపడుతూ ఉంటుంది.
అందరూ ఉండంగానే అతడు ఇంత క్రూరంగా ఉంటే, ఎవరూ లేని చోట తీసుకెళ్లి ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటుంది. హనీమూన్ కి వెళ్ళాక అక్కడ కూడా ఆమె వణికిపోతూ ఉంటుంది. అక్కడినుంచి హనీమూన్ జరగకుండానే మళ్లీ ఇంటికి తిరిగి వస్తారు. ఆ సమయంలో మాత్రమే అతడు రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మిగతా సమయం అంతా నందినిని మంచిగానే చూసుకుంటాడు. ఒకరోజు నందిని భర్త తీవ్రంగా ఆమెను ఆ విషయంలో వేదిస్తాడు. తీవ్ర గాయాల తో నందిని హాస్పిటల్ లో చేరుతుంది. భర్త మీద గృహహింస కేసు నమోదు చేస్తుంది. చివరికి భర్త నుంచి భార్య విడిపోతుందా? భర్త ఆ విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? సంపూర్ణ ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “సంపూర్ణ” (sampurna) వెబ్ సిరీస్ ను తప్పకుండా చూడండి.