BigTV English

OTT Movie : కొండపై ఇల్లు, ఇంట్లో రెండు జంటలు… పీడకల లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : కొండపై ఇల్లు, ఇంట్లో రెండు జంటలు… పీడకల లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : ఓటిటిలో వేల కొద్ది సినిమాలు ఉన్నప్పటికీ ప్రతి వారం కొత్త కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇక అందులో ఉండే హారర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్ని సినిమాలను చూసేశాం అని ఫీల్ అయ్యే వారికి కూడా ఇంకా ఓటిటిలో చూసే కంటెంట్ లెక్క లేనంత మిగిలిపోయి ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఓటిటిలో సందడి చేస్తాయి. మరికొన్ని సినిమాలకు మాత్రం ఏళ్లు గడుస్తున్నా ఆ భాగ్యం మాత్రం దక్కదు. అలాంటి ఓ సినిమా గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మరి ఆ మూవీ ఏంటి? స్టోరీ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే…


నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి హారర్ మూవీ…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మూవీ హాలీవుడ్ మూవీ. 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బిగ్ స్క్రీన్ పై బాగానే ఆడింది. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ మూవీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓటిటిలో అడుగు పెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సదరు సినిమాను ఏకంగా నాలుగేళ్ల తర్వాత ఓటిటి రిలీజ్ కు రెడీ చేశారు. అయితే రెగ్యులర్ గా ఉండే ఓటిటి ప్లాట్ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లాంటి ఓటీటీలో కాకుండా లయన్స్ గేట్ అనే ఓటిటిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇంకా ఈ సినిమాను చూడకపోతే ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడండి.


Watch The Rental (2020) Full Movie Online - Plex

స్టోరీ ఏంటంటే…

ఈ మూవీ మొత్తం రెండు జంటలు చుట్టే తిరుగుతుంది. సాధారణంగానే అప్పుడప్పుడూ వర్క్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అన్పిస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ గజిబిజి జీవితాల్లో పడి విసిగిపోయిన ఆ రెండు జంటలు ఎక్కడికైనా ట్రిప్పు వెళ్దామని ప్లాన్ చేస్తాయి. అలాగైనా కాస్త రిలాక్స్ కావచ్చు అని ఫీల్ అవుతారు. మొత్తానికి బాగా వెతికి వెతికి ఒక కొండపై ఉండే ఇంటిని చూసుకుంటారు. అది సిటీకి దూరంగా, ఈ రణగొణ ధ్వనులు వినిపించకుండా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీంతో ఆ రెండు జంటలు కలిసి ఎవరూ లేరని ఒక కొండపై ఉన్న ఆ ఇంటిని అద్దెకి తీసుకుంటారు. మొత్తానికి అనుకున్నట్టుగా వెళ్ళగానే ప్రశాంతంగానే అనిపిస్తుంది. చుట్టూ ప్రకృతి, మనుషులే కన్పించని అడవి..  కానీ నెమ్మదిగా పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతాయి. సరదాగా వెకేషన్ కి వెళ్ళిన ఆ జంటకు చావు కబురు చల్లగా అందుతుంది. చూస్తుండగానే ఒక్కొక్కరు చావు అంచులు దాకా వెళ్తారు. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయట పడగలిగారా లేదా? అసలు వాళ్లకు అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే ది రెంటల్ అనే ఈ సినిమాను చూసి తీరాల్సిందే.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×