BigTV English

OTT Movies : ఆ బీచ్ లో హనీమూన్ అంటే డెత్ డే కన్ఫర్మ్… వణికించే మర్డర్ మిస్టరీ

OTT Movies : ఆ బీచ్ లో హనీమూన్ అంటే డెత్ డే కన్ఫర్మ్…  వణికించే మర్డర్ మిస్టరీ

OTT Movies : మర్డర్ మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. తాజాగా ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. అయితే ఇది తెలుగులో కూడా రిలీజ్ కాబోతుండడం విశేషం. ఆ బీచ్ లో హనీమూన్ కు వెళ్లారంటే కచ్చితంగా డెత్ డే అని కన్ఫర్మ్ అయినట్టే. మరి ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ ఏ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది ? ఈ వెబ్ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


జియో సినిమాలో అందుబాటులో 

ఓటిటిలో ప్రస్తుతం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ లుగా వచ్చే సినిమాలకు, సిరీస్ లకు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు లేదా సిరీస్లో హంతకుడు ఎవరు అన్న విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ లోనే ఉంచి, గ్రిప్పింగ్ స్టోరీతో ప్రేక్షకులను స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోనియకుండా, కనీసం పక్కకు కూడా కదలనియకుండా చేస్తాయి. అందుకే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను చూడడానికి ఓటిటి మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ కూడా అలాంటిదే. అన్నీ సినిమాలు ఇలాగే ఉంటాయని చెప్పలేము. కానీ కొన్ని సినిమాలు లేదా సిరీస్ ల ట్రైలర్ లు చూస్తే అలాంటి స్టోరీని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అనే నమ్మకం అయితే కలుగుతుంది. అయితే ట్రైలర్ ను బట్టి అంచనా వేసినా, ఆ అంచనాలు అందుకున్న సినిమాలు కూడా తక్కువే. మరి ఈ సిరీస్ ఏ కేటగిరిలోకి వస్తుంది? అంటే ప్రేక్షకులే చూసి డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఈ సిరీస్ ఇంకా ఓటీటీలోకి రాలేదు.  కాగా ఈ సిరీస్ జియో సినిమా అనే ఓటిటి ప్లాట్ఫారంలో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ఆశా నిగి, సాహిల్ సలాథియా, రాజు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. అర్జున్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది.


Honeymoon Photographer Trailer: Murder Mystery Around Secrets And Suspects After Groom Found Dead | Asha Negi | Times Now

స్టోరీ లోకి వెళ్తే…

హీరోయిన్ ఇందులో ఒక ఫోటోగ్రాఫర్. కొత్తగా పెళ్లయిన ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్తారు. అక్కడ సంతోషంగా ఉండాల్సిన ఈ జంటకు అనూహ్యంగా ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. భర్తతో హ్యాపీగా కలిసి ఉండాల్సిన ఆ భార్యకు అతడు బీచ్ లో శవమై కనిపిస్తాడు. దీంతో అసలు అతన్ని ఎవరు హత్య చేశారు అనే మిస్టరీనీ చేదించే క్రమంలో నలుగురు వ్యక్తులు అతని హత్య కేసులో నిందితులుగా కనిపిస్తారు. ఆ లిస్ట్ లో అతని భార్యతో పాటు ఫ్యామిలీ మెంబర్, ఈ జంటను ఫాలో చేసే అపరిచితుడు, ఫ్రెండ్ కూడా ఉంటారు. మరి అతన్ని ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే విషయం తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ పేరు హనీమూన్ ఫోటోగ్రాఫర్. సెప్టెంబర్ 27 నుంచి జియో సినిమాలో ఈ మర్డర్ మిస్టరీ హిందీలో కూడా స్ట్రీమింగ్ కానుంది.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×