BigTV English

OTT Movies : ఐఎండిబి రేటింగ్ లో దుమ్ము రేపుతున్న కొరియన్ డ్రామాలు… తెలుగులో ఎక్కడ చూడొచ్చు అంటే??

OTT Movies : ఐఎండిబి రేటింగ్ లో దుమ్ము రేపుతున్న కొరియన్ డ్రామాలు… తెలుగులో ఎక్కడ చూడొచ్చు అంటే??

OTT Movies : కరోనా పుణ్యమా అని ఓటిటిలతో పాటు అందులో స్ట్రీమింగ్ అయ్యే కొరియన్ డ్రామాలకు కూడా మంచి క్రేజ్ పెరిగింది. చాలామంది భాష రాకపోయినా సరే కొరియన్ డ్రామాలను చూడడమే కాక ఆ భాషను మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నారు. కొరియన్ సిరీస్ లకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీలు కూడా ఇంగ్లీష్ తో పాటు తెలుగు లాంటి భారతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. అలా రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన కొన్ని కొరియన్ వెబ్ సిరీస్ లు ఐఎండిబి రేటింగ్ లో అదరగొడుతున్నాయి. మరి ఆ సిరీస్ లు ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి? తెలుగులో ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళితే….


రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జానర్ లకు సంబంధించిన కంటెంట్ ఉండే కొరియన్ డ్రామాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసింది. ఇలాంటి కొరియన్ డ్రామాలు ప్రస్తుతం తెలుగులో ఆహా, ఈటీవీ విన్ లాంటి ఓటిటిలో అందుబాటులో ఉన్నాయి.

ఫైట్ ఫర్ మై వే


2017లో రిలీజ్ అయిన రొమాంటిక్ కొరియన్ కామెడీ వెబ్ సిరీస్ ‘ఫైట్ ఫర్ మై వే’. జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ప్రేమలో పడే చిన్ననాటి స్నేహితుల కథ ఇది. ఐఎండిబిలో దీని రేటింగ్ 8.1 ఉండగా, ప్రస్తుతం ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్కూల్ 2017

ఇది కూడా ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ వెబ్ సిరీస్. కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలనే ఒత్తిడిని అధిగమించడానికి పడే తంటాలను ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

యూత్ ఆఫ్ మే

2021 లో వచ్చిన రొమాంటిక్ కొరియన్ డ్రామా ‘యూత్ ఆఫ్ మే’. 1980 ల నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మెడికల్ స్టూడెంట్, నర్స్ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా దీనికి ఐఎండిబి లో 8.3 రేటింగ్ ఉంది.

వెల్కమ్ టు లైఫ్

‘వెల్కమ్ టు లైఫ్’ సిరీస్ గత నెలలోనే తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈటీవీ విన్ అనే ఓటీటీలో ఈ కొరియన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా, స్టోరీ మొత్తం ఒక సెల్ఫీష్ లాయర్ చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రమాదం జరిగాక కళ్ళు తెరుచుకుని, అప్పటిదాకా చేసిన మెంటల్ పనులన్నీ పక్కన పెట్టి నిజాయితీగా బ్రతకాలని డిసైడ్ అవుతాడు. ఐఎండిబీ లో దీని రేటింగ్ 7.2 గా ఉంది.

ఐ యాం నాట్ ఏ రోబో

ఇదొక రొమాంటిక్ అండ్ కామెడీ కొరియన్ వెబ్ సిరీస్. 2017 – 18 మధ్యలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఐఎండిబి లో దీని రేటింగ్ 8.0 గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రూ కొరియన్ డ్రామాల ఫ్యాన్స్ అయ్యి ఉండి, ఇంకా ఈ సిరీస్ లను చూడకపోతే తప్పకుండా ఈ వీకెండ్ చూడండి.

Tags

Related News

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

OTT Movie : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

Big Stories

×